IPL 2025 Final: పంజాబ్‌పై ఆర్సీబీ విజయం | IPL 2025 Final: RCB VS PBKS Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IPL 2025 Final: పంజాబ్‌పై ఆర్సీబీ విజయం

Jun 3 2025 7:10 PM | Updated on Jun 3 2025 11:34 PM

IPL 2025 Final: RCB VS PBKS Live Updates And Highlights

Photo Courtesy: BCCI

పంజాబ్‌పై ఆర్సీబీ విజయం​
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో ఇవాళ (జూన్‌ 3) జరిగిన ఐపీఎల్‌ 2025 ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.

ఓటమి దిశగా పంజాబ్‌
16.4వ ఓవర్‌- పంజాబ్‌ ఓటమి దిశగా సాగుతుంది. 142 పరుగుల వద్ద ఆ జట్టు ఆరో వికెట్‌ కోల్పోయింది. భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాదిన మరుసటి బంతికే స్టోయినిస్‌ (6) ఔటయ్యాడు. 

ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్‌
పంజాబ్‌ గెలుపుకు 24 బంతుల్లో 55 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. నేహల్‌ వధేరా (15), శశాంక్‌ సింగ్‌ (22) క్రీజ్‌లో ఉన్నారు.  

కష్టాల్లో పంజాబ్‌
12.1వ ఓవర్‌- 98 పరుగుల వద్ద పంజాబ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో బౌండరీ లైన్‌ వద్ద లివింగ్‌స్టోన్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో జోష్‌ ఇంగ్లిస్‌ (39) ఔటయ్యాడు. 

మూడో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
9.4వ ఓవర్‌- 79 పరుగుల వద్ద పంజాబ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. రొమారియో షెపర్డ్‌ బౌలింగ్‌లో జితేశ్‌ శర్మ క్యాచ్‌ పట్టడంతో ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (1) ఔటయ్యాడు. 

రెండో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
8.3వ ఓవర్‌- 72 పరుగుల వద్ద పంజాబ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌కు క్యాచ్‌ ఇచ్చి ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (26) ఔటయ్యాడు. 

8 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 70/1
ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 25, జోష్‌ ఇంగ్లిస్‌ 16

తొలి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
4.6వ ఓవర్‌- 43 పరుగుల వద్ద పంజాబ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో ఫిల్‌ సాల్ట్‌ అద్బుతమైన క్యాచ్‌ పట్టడంతో ప్రియాంశ్‌ ఆర్మ (24) ఔటయ్యాడు. 

టార్గెట్‌ 191.. 3 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 28/0
ప్రభ్‌సిమ్రన్‌ 10, ప్రియాంశ్‌ ఆర్య 14

200లోపు స్కోర్‌కే పరిమితమైన ఆర్సీబీ
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 200లోపు స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగలిగింది. చివరి ఓవర్‌ను అర్షదీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లలో జేమీసన్‌ 3, ఒమర్‌జాయ్‌, విజయ్‌కుమార్‌ వైశాక్‌, చహల్‌ తలో వికెట్‌ తీశారు. 

ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. 35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లినే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో సాల్ట్‌16, లివింగ్‌స్టోన్‌ 25, జితేశ్‌ శర్మ 24, మయాంక్‌ అగర్వాల్‌ 24, రజత్‌ పాటిదార్‌ 26, రొమారియో షెపర్డ్‌ 17, కృనాల్‌ పాండ్యా 4, భువనేశ్వర్‌ కుమార్‌ 1 పరుగు చేసి ఔటయ్యారు. 

ఆరో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
17.4వ ఓవర్‌-171 పరుగుల వద్ద ఆర్సీబీ ఆరో వికెట్‌ కోల్పోయింది. విజయ్‌కుమార్‌ వైశాక్‌ బౌలింగ్‌లో జితేశ్‌ శర్మ (24) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

ఐదో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
16.5వ ఓవర్‌- 167 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్‌ కోల్పోయింది. జేమీసన్‌ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 

విరాట్‌ కోహ్లి ఔట్‌
14.5వ ఓవర్‌- 131 పరుగుల వద్ద ఆర్సీబీకి భారీ షాక్‌ తగిలింది. స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి 35 బంతుల్లో 43 పరుగులు చేసి ఔటయ్యాడు. అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ విరాట్‌ను క్యాచ్‌ అండ్‌ బౌల్డ్‌ చేశాడు.  

12 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 103/3

విరాట్‌ కోహ్లి 32, లివింగ్‌స్టోన్‌ 3

మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రజత్ పటిదార్‌ 26(16) పరుగుల వద్ద జెమీసన్ బౌలింగ్‌లో ఔటయ్యారు.

పది ఓవర్లలో ఆర్సీబీ స్కోర్ 87/2

పది ఓవర్లలో ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయి 87 పరుగులు సాధించింది. 

9 ఓవర్లలో ఆర్సీబీ స్కోర్‌ 80/2

ఫైనల్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 80 పరుగులు సాధించింది. కోహ్లీ  21(18),  రజత్ పటిదార్ 17(9) క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
6.2వ ఓవర్‌- 56 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది. చహల్‌ బౌలింగ్‌లో అర్షదీప్‌కు క్యాచ్‌ ఇచ్చి మయాంక్‌ అగర్వాల్‌ (24) ఔటయ్యాడు. 

6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 55/1
మయాంక్‌ అగర్వాల్‌ 24, విరాట్‌ కోహ్లి 13

తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
1.4వ ఓవర్‌- 18 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. జేమీసన్‌ బౌలింగ్‌లో  శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి సాల్ట్‌ (16) ఔటయ్యాడు. 

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (జూన్‌ 3) జరుగుతున్న ఐపీఎల్‌ 2025 ఫైనల్లో పంజాబ్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌, ఆర్సీబీ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.

ఈ సీజన్‌లో ఐపీఎల్‌కు కొత్త ఛాంపియన్‌ రావడం​ ఖరారైపోయింది. ఆర్సీబీ, పంజాబ్‌ జట్లలో ఏ జట్టు గెలిచినా చరిత్రే అవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా టైటిల్‌ సాధించలేకపోయాయి. ఆర్సీబీ 3 సార్లు, పంజాబ్‌ ఓసారి ఫైనల్‌కు చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకున్నాయి. 

ఈ సీజన్‌లో ఇరు జట్లు పోటీపోటీగా రాణించి ఫైనల్‌ వరకు చేరాయి. లీగ్‌ దశలో పంజాబ్‌, ఆర్సీబీ సమంగా మ్యాచ్‌లు గెలిచి (14లో 9) పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. లీగ్‌ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో తలో మ్యాచ్‌ గెలిచాయి. క్వాలిఫయర్‌-1లో పంజాబ్‌పై ఆర్సీబీ పైచేయి సాధించింది.  

జట్ల వివరాలు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్

ఇంపాక్ట్ సబ్స్: రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్, సుయాష్ శర్మ.

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జేవియర్ బార్ట్‌లెట్, హర్‌ప్రీత్ బ్రార్

Advertisement
 
Advertisement
Advertisement