ఆర్సీబీకి మ‌రో బిగ్ షాక్‌.. ఇంటికి వెళ్లిపోయిన డెంజరస్‌ ప్లేయర్‌? | RCB Superstar Doubtful For IPL 2025 Final Against PBKS | Sakshi
Sakshi News home page

IPL 2025 Final: ఆర్సీబీకి మ‌రో బిగ్ షాక్‌.. ఇంటికి వెళ్లిపోయిన డెంజరస్‌ ప్లేయర్‌?

Jun 3 2025 10:59 AM | Updated on Jun 3 2025 11:11 AM

RCB Superstar Doubtful For IPL 2025 Final Against PBKS

PC: BCCI/IPL.com

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌మ 18 ఏళ్ల ఐపీఎల్ ట్రోఫీ క‌ల‌ను నేర‌వేర్చుకునేందుకు అడుగు దూరంలో ఉంది. ఐపీఎల్‌-2025 ఫైన‌ల్‌లో మంగ‌ళ‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీమీ తాడోపేడో తెల్చుకోనుంది. తొలి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడాల‌ని భావిస్తున్న బెంగ‌ళూరు జ‌ట్టుకు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలిన‌ట్లు తెలుస్తోంది. ఆ జ‌ట్టు విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ ఫిల్ సాల్ట్ ఫైన‌ల్ మ్యాచ్‌కు దూరం కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. 

అత‌డి భార్య మొద‌టి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుంది. ఈ క్ర‌మంలో సాల్ట్ త‌న ఫ్యామిలీతో ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఫైన‌ల్‌కు ముందు రోజు ఆర్‌సీబీ నిర్వ‌హించిన ప్రాక్టీస్ సెష‌న్‌లో అత‌డు పాల్గొన‌లేదు. దీంతో అత‌డు ఆఖ‌రి మ్యాచ్‌లో ఆడేది అనుమానంగా మారింది.

"పంజాబ్‌తో మ్యాచ్ కోసం ఫిల్ సాల్ట్‌ ఆర్సీబీ జ‌ట్టుతో పాటు అహ్మ‌దాబాద్‌కు చేరుకోలేదు. త‌న‌ భార్య మొద‌టి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుండ‌డంతో ఇంగ్లండ్‌కు వెళ్లాల‌ని సాల్ట్ ప్లాన్ చేసుకున్నాడు. ఈ విష‌యాన్ని ఇదివ‌ర‌కే ఆర్సీబీ మెనెజ్‌మెంట్‌కు తెలియ‌జేశాడు" అని ఈఎస్సీఎన్ క్రిక్ ఇన్ ఫో త‌మ క‌థ‌నంలో పేర్కొంది.

అయితే ప్రీ మ్యాచ్ కాన్ఫ‌రెన్స్‌లో ఈ విషయంపై కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్, ప్ర‌ధాన కోచ్ అండీ ఫ్ల‌వ‌ర్ కనీసం స్పందించ‌లేదు. కీల‌క మ్యాచ్‌కు ముందు ఈ విష‌యాన్ని ర‌హ‌స్యంగా ఉంచాల‌ని కోరుకుంటున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఒక‌వేళ తుది పోరుకు సాల్ట్ దూర‌మైతే ఆర్సీబీకి నిజంగా అది గ‌ట్టి ఎదురు దెబ్బే అవుతోంది. 

ఎందుకంటే ఈ ఏడాది సీజ‌న్‌లో సాల్ట్ త‌న విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో ఆర్సీబీకి ఆదిరిపోయే ఆరంభాల‌ను అందిస్తున్నాడు. . ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 12 మ్యాచ్‌ల్లో 175.90 స్ట్రైక్‌రేటుతో 35.18 స‌గ‌టుతో 387 ప‌రుగులు చేశాడు. సాల్ట్ అందుబాటులో లేక‌పోతే అత‌డి స్ధానంలో కివీస్ ఆట‌గాడు టిమ్ సీఫర్ట్ తుది జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Advertisement
 
Advertisement
Advertisement