వధేరా, శ‌శాంక్ మెరుపులు.. రాజ‌స్తాన్ ముందు భారీ టార్గెట్‌ | IPL 2025: Nehal Wadhera, Shashank Singh Takes Punjab kings to 219/5 | Sakshi
Sakshi News home page

IPL 2025: వధేరా, శ‌శాంక్ మెరుపులు.. రాజ‌స్తాన్ ముందు భారీ టార్గెట్‌

May 18 2025 5:19 PM | Updated on May 18 2025 5:51 PM

IPL 2025: Nehal Wadhera, Shashank Singh Takes Punjab kings to 219/5

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో జైపూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట‌ర్లు దుమ్ములేపారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 219 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ఆరంభంలోనే ఇన్ ఫామ్ బ్యాట‌ర్ ప్రియాన్ష్ ఆర్య(9) వికెట్ కోల్పోయిన‌ప్ప‌టికి.. ఆ త‌ర్వాత వ‌చ్చిన బ్యాట‌ర్లు ఒక మిచెల్ ఓవెన్ త‌ప్ప మిగితా అందరూ త‌మ ప‌ని తాము చేసుకుపోయారు.

పంజాబ్ బ్యాట‌ర్ల‌లో నేహాల్ వధేరా( 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 70), శ‌శాంక్ సింగ్‌(30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 59 నాటౌట్‌) అద్భుత‌మైన హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగ‌గా.. శ్రేయ‌స్ అయ్య‌ర్‌(30), ఓమ‌ర్జాయ్‌(21), ప్ర‌భుసిమ్రాన్ సింగ్‌(21) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో తుషార్ దేశ్‌పాండే రెండు, మ‌ఫాక‌, ప‌రాగ్‌, మ‌ధ్వాల్ త‌లా వికెట్ సాధించారు.

తుది జట్లు..
రాజస్థాన్‌ రాయల్స్‌: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్‌), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(వికెట్‌ కీపర్‌), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, తుషార్‌ దేశ్‌పాండే, ఆకాష్ మధ్వల్, ఫజల్‌హాక్ ఫరూఖీ, క్వేనా మఫాకా.

ఇంపాక్ట్ సబ్స్: కుమార్ కార్తికేయ, శుభమ్ దూబే, అశోక్ శర్మ, కునాల్ సింగ్ రాథోడ్, యుధ్వీర్ సింగ్ చరక్

పంజాబ్‌ కింగ్స్‌: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీప‌ర్‌), ప్రియాంష్ ఆర్య, మిచ్ ఓవెన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, జేవియర్ బార్ట్‌లెట్.
ఇంపాక్ట్ సబ్స్‌: విజయ్‌కుమార్ వైషాక్, హర్‌ప్రీత్ బ్రార్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ముషీర్ ఖాన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement