ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తమ కోచింగ్ స్టాప్‌లో కీలక మార్పులు చేసింది. తమ జట్టు హెడ్‌కోచ్‌గా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరను రాజస్తాన్ నియమించింది. గత సీజన్‌లో రాయల్స్ ప్రధాన కోచ్‌గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్ స్దానాన్ని సంగక్కర భర్తీ చేయనున్నాడు.
హెడ్‌కోచ్‌తో పాటు రాజస్తాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కూడా అతడు తన సేవలను అందించాడు. సంగక్కర గతంలో కూడా ఇదే పదవుల్లో కొనసాగాడు. ఈ శ్రీలంక మాజీ కెప్టెన్ 2021లో రాజస్థాన్ ఫ్రాంచైజీలో చేరాడు. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కెరీర్ ప్రారంభించిన అతడు కోచ్‌గా నియమితులయ్యాడు. అతడి దిశానిర్దేశనంలో రాజస్తాన్ నాలుగు పర్యాయాలు ప్లే ఆఫ్స్ ఆడింది.
అయితే ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు రాహుల్ ద్రవిడ్ రాకతో సంగాను రాజస్తాన్ పక్కన పెట్టింది. ఇప్పుడు ద్రవిడ్ తన పదవి నుంచి వైదొలగడంతో సంగక్కర మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయాన్ని రాయల్స్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరిచింది. రాజస్తాన్ రాయల్స్‌కు రెండో ఐపీఎల్ టైటిల్‌ను అందించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాను అని అతడు పేర్కొన్నాడు.
అదేవిధంగా బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న విక్రమ్ రాథోడ్‌ను లీడ్ అసిస్టెంట్ కోచ్‌గా రాజస్తాన్ ప్రమోట్ చేసింది. మాజీ న్యూజిలాండ్ స్టార్ షేన్ బాండ్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగనున్నాడు. ఇంగ్లండ్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ట్రెవర్ పెన్నీ తిరిగి అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
రాజస్తాన్‌కు కొత్త కెప్టెన్..
ఇక ఐపీఎల్-2026 సీజన్‌లో రాజస్తాన్‌కు కొత్త కెప్టెన్ రానున్నాడు. మినీ వేలానికి ముందు రాజస్తాన్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌ను ట్రేడ్ చేసింది. సీఎస్‌కే నుంచి రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్ వంటి స్టార్ ఆల్‌రౌండర్లను రాజస్తాన్ సొంతం చేసుకుంది. అయితే రాబోయో సీజన్‌లో రియాన్ పరాగ్ రాజస్తాన్ కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశముంది.
చదవండి: IND vs SA: తొలి టెస్టులో ఓటమి.. గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం


