
PC: BCCI/IPL.com
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్-2025 సీజన్ తిరిగి శనివారం నుంచి ప్రారంభం కానుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్ సీజన్ రీ స్టార్ట్ కానుంది. అయితే ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు చాలా మంది విదేశీ ఆటగాళ్లు దూరమయ్యారు.
ఈ ఏడాది సీజన్ వారం రోజుల పాటు వాయిదా పడడంతో ఫారన్ ప్లేయర్లు తమ స్వదేశాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో స్వదేశానికి వెళ్లిపోయిన ఆటగాళ్లలో కొంత మంది తిరిగి భారత్‌కు రావడానికి నిరాకరించారు. కొంతమంది జాతీయ విధుల కారణంగా దూరంగా ఉంటే, మరి కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్‌లో పాల్గోనేందుకు తిరిగి రాలేదు.
సౌతాఫ్రికాకు చెందిన ఆటగాళ్లు భారత్‌కు వచ్చినప్పటికి ప్లే ఆఫ్స్‌కు మాత్రం అందుబాటులో ఉండేది అనుమానమే. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఆ వీడియోలో ఏముందంటే?
ఐపీఎల్-2025 సెకెండ్ లెగ్ కోసం జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, జోష్ హేజిల్‌వుడ్, మార్కో జాన్సెన్ వంటి ఆటగాళ్లు తిరిగి వస్తారా? లేదా అని ఇద్దరు వ్యక్తులు సీరియస్‌గా చర్చించుకుంటారు. ఆ సమయంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జోక్యం చేసుకుని.. "మీరు మాట్లాడుకుంటున్న వాళ్లంతా నిజంగా టాలెంటెడ్ క్రికెటర్లే.
కానీ ఇది 'ఇండియన్' ప్రీమియర్ లీగ్ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఐపీఎల్ కొనసాగడానికి ఫారన్ ప్లేయర్స్ వస్తానే కాదు, ఇండియన్ ప్లేయర్స్ ఉంటే చాలు అని ఉద్దేశంతో అయ్యర్ అన్నాడు.
Yatra pratibha avsara prapnotihi! ❤️ pic.twitter.com/UBRjCs8Bua
— Punjab Kings (@PunjabKingsIPL) May 17, 2025