
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎంపిక కాకపోయిన సంగతి తెలిసిందే. దీంతో అయ్యర్ తనకు లభించిన ఈ ఖాళీ సమయాన్ని కుటుంబానికి కేటాయించాడు. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్న శ్రేయస్ తన ఫ్యామిలీతో సరదగా గడుపుతున్నాడు.
తాజాగా శ్రేయస్ అయ్యర్ తన ఇంట్లో తల్లితో కలిసి క్రికెట్ ఆడాడు. అయ్యర్ బ్యాటింగ్ చేయగా.. అతడి తల్లి బౌలింగ్ చేసింది. అయితే ఆమె విసిరిన ఓ బంతిని శ్రేయస్ కొట్టలేకపోయాడు. దీంతో ఆమె అయ్యర్‌ను క్లీన్ బౌల్డ్ చేసినట్లు సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ వీడియోను పంజాబ్ కింగ్స్ ఎక్స్‌లో షేర్ చేసింది.
మా సర్పాంచ్ సాబ్ ఇప్పుడు మాత్రం బౌల్డ్ అయినా పట్టించుకోడని పంజాబ్ క్యాప్షన్‌గా జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో సొషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఐపీఎల్-2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను అయ్యర్ రన్నరప్‌గా నిలిచాడు.
అద్బుతమైన ప్రదర్శనలతో ఫైనల్ చేరినప్పటికి.. తుది మెట్టుపై ఆర్సీబీ చేతిలో పంజాబ్ బోల్తా పడింది. ప్రస్తుతం క్రికెట్ దూరంగా ఉన్న అయ్యర్ వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది.
చదవండి: ఇంగ్లండ్‌కు టీమిండియా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలి.. లేదంటే కష్టమే: రవిశాస్త్రి
Only time SARPANCH won't mind getting bowled! 😂♥️ pic.twitter.com/jYUDd7DkD7
— Punjab Kings (@PunjabKingsIPL) June 30, 2025