
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ మోకాలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెర్గూసన్ మోకాలికి గాయమైంది.
అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీజన్ మొత్తానికి ఫెర్గూసన్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని జట్టు బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ కూడా ధృవీకరించాడు. లాకీ ఫెర్గూసన్ మోకాలి గాయంతో బాధపడుతున్నాడు.
అతడు ప్రస్తుతం జట్టుతో ఉన్నప్పటకి, మిగిలిన టోర్నమెంట్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అని హోప్స్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్‌లో ఫెర్గూసన్ మంచి టచ్‌లో కన్పించాడు. ఫెర్గూసన్ పంజాబ్ తరపున నాలుగు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు.
అయితే అతడి స్ధానంలో జేవియర్ బార్ట్‌లెట్ లేదా అజ్మతుల్లా ఒమర్జాయ్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. ఈ ఏడాది సీజన్‌లో పంజాబ్ కింగ్స్ పర్వాలేదన్పిస్తోంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు పంజాబ్ మూడింట గెలుపొందింది.
ఐపీఎల్-2025కు పంజాబ్ కింగ్స్ జట్టు..
శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, నెహాల్ వధేరా, హర్‌ప్రీత్ బ్రార్, విష్ణు వినోద్, విజయ్‌కుమార్ వైషాక్, యశ్ ఠాకూర్, మార్కో జాన్సెన్, జోష్ ఇంగ్లిస్, హర్నూర్ పన్ను, కుల్దీప్ సేన్, ప్రియాంష్ ఆర్య, ఆరోన్ హార్డీ, ముషీర్ ఖాన్, సూర్యాంశ్ షెడ్జ్, జేవియర్ బార్ట్‌లెట్, పైలా అవినాష్, ప్రవీణ్ దూబే.
చదవండి: IPL 2025: అక్షర్ పటేల్‌కు భారీ షాక్.. రూ.12 లక్షల జరిమానా