'అత‌డితో పంజాబ్ జాగ్ర‌త్త‌గా ఉండాలి.. లేదంటే వార్ వ‌న్ సైడే' | Yograj Singh drops bold prediction for RCB vs PBKS IPL final | Sakshi
Sakshi News home page

IPL 2025 Final: 'అత‌డితో పంజాబ్ జాగ్ర‌త్త‌గా ఉండాలి.. లేదంటే వార్ వ‌న్ సైడే'

Jun 3 2025 12:30 PM | Updated on Jun 3 2025 1:17 PM

Yograj Singh drops bold prediction for RCB vs PBKS IPL final

ఐపీఎల్‌-2025 ఫైన‌ల్లో అహ్మదాబాద్ వేదిక‌గా త‌ల‌ప‌డేందుకు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ సిద్ద‌మ‌య్యాయి. ఈ తుది పోరుకు ఇరు జ‌ట్లు ఆస్త్ర‌శస్త్రాల‌ను సిద్దం చేసుకున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తొలి ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకోవాల‌ని ఇరు జ‌ట్లు ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి.

ఈ హైవోల్జేజ్ మ్యాచ్‌కు ముందు భార‌త మాజీ క్రికెట‌ర్ యోగరాజ్ సింగ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. విరాట్ కోహ్లితో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, ప‌వ‌ర్ ప్లేలో ఔట్ కాక‌పోతే 250 ప‌రుగుల‌కు పైనా ల‌క్ష్య‌మున్నా అత‌డు చేజ్ చేసేస్తాడ‌ని యోగ‌రాజ్ పంజాబ్‌ను హెచ్చ‌రించాడు.

"ఆరంభంలో విరాట్ కోహ్లిని ఔట్ చేయ‌క‌పోతే పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అత‌డు ప‌వ‌ర్‌ప్లేలో ఔట్ కాక‌పోతే 250 నుంచి 300 ప‌రుగుల టార్గెట్‌నైనా క‌రిగించేగ‌ల‌డు. అయితే పంజాబ్ జ‌ట్టు అత్యుత్త‌మంగా ఉంది. వారు ఈ ఏడాది సీజ‌న్‌లో అద్బుతంగా ఆడారు. 

ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలుస్తుంద‌ని నేను అనుకుంటున్నాను. కానీ మొద‌టి ప‌ది ఓవ‌ర్ల‌లో కోహ్లి ఔట్ కాక‌పోతే మ్యాచ్ వ‌న్‌సైడ్ అయిన‌ట్లే. పంజాబ్ జట్టుకు అద్భుతమైన కెప్టెన్ ఉన్నాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ ఒక టాలెంటెడ్ ప్లేయ‌ర్‌. ఈ మ్యాచ్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌, కోహ్లి మధ్య పోటీ అనే చెప్పుకోవాలి.

ఆర్సీబీని గెలిపించేందుకు కోహ్లి ఉంటే, పంజాబ్‌లో అయ్య‌ర్ ఉన్నాడు. పంజాబ్ గెల‌వాలని నేను మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను అని ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో యోగరాజ్ పేర్కొన్నాడు.
తుది జట్ల వివరాలు (అంచనా)  
బెంగళూరు: రజత్‌ పాటీదార్‌ (కెప్టెన్‌), కోహ్లి, సాల్ట్, మయాంక్‌ అగర్వాల్, లివింగ్‌స్టోన్, జితేశ్‌ శర్మ, షెఫర్డ్, భువనేశ్వర్, కృనాల్‌ పాండ్యా, యశ్‌ దయాళ్, హాజల్‌వుడ్‌.

పంజాబ్‌: శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), ప్రియాన్ష్ఆర్య, ప్రభ్‌సిమ్రన్, ఇన్‌గ్లిస్, నేహల్‌ వధేరా, స్టొయినిస్, శశాంక్‌ సింగ్, అజ్మతుల్లా, చహల్, జేమీసన్, అర్ష్‌దీప్‌ సింగ్‌.

Advertisement
 
Advertisement
Advertisement