చరిత్ర సృష్టించిన పంజాబ్‌ కింగ్స్‌.. ముంబై రికార్డు బద్దలు | PBKS Breaks MIs Record To Register Highest-Ever Total At Sawai Mansingh Stadium | Sakshi
Sakshi News home page

IPl 2025: చరిత్ర సృష్టించిన పంజాబ్‌ కింగ్స్‌.. ముంబై రికార్డు బద్దలు

May 18 2025 6:42 PM | Updated on May 18 2025 7:28 PM

PBKS Breaks MIs Record To Register Highest-Ever Total At Sawai Mansingh Stadium

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో పంజాబ్ కింగ్స్ బ్యాట‌ర్లు మ‌రోసారి చెల‌రేగారు. జైపూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్‌టో టాస్  ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 219 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది.  ఆరంభంలో 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ ఆ తర్వాత తిరిగి పుంజుకుంది. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌పై పంజాబ్ బ్యాట‌ర్లు విరుచుకుప‌డ్డారు. 

పంజాబ్ బ్యాట‌ర్ల‌లో నేహాల్ వధేరా( 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 70) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. శ‌శాంక్ సింగ్‌(30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 59 నాటౌట్‌),  శ్రేయ‌స్ అయ్య‌ర్‌(30), ఓమ‌ర్జాయ్‌(21), ప్ర‌భుసిమ్రాన్ సింగ్‌(21) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ క్ర‌మంలో పంజాబ్ కింగ్స్ ఓ అరుదైన రికార్డును త‌మ ఖాతాలో వేసుకుంది. 

జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో అత్య‌ధిక ఐపీఎల్ స్కోర్ సాధించిన జ‌ట్టుగా పంజాబ్ నిలిచింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు ముంబై ఇండియ‌న్స్ పేరిట ఉండేది. ఈ వేదికపై గతంలో రాజ‌స్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 2 వికెట్లు కోల్పోయి 217 ప‌రుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో ముంబై రికార్డును శ్రేయ‌స్ సేన బ్రేక్ చేసింది.

అదేవిధంగా ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో మిడిలార్డ‌ర్ నంబ‌ర్ 4 నుంచి నంబ‌ర్ 7 వ‌ర‌కు మొత్తం క‌లిపి అత్య‌ధిక ప‌రుగులు చేసిన జ‌ట్టుగా పంజాబ్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట‌ర్లు నంబ‌ర్ 4 నుంచి నంబ‌ర్ 7 వ‌ర‌కు క‌లిపి మొత్తంగా 180 ప‌రుగులు చేశారు. ఇంత‌కుముందు ఈ రికార్డు ముంబై ఇండియ‌న్స్‌(174) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ముంబైని పంజాబ్ అధిగ‌మించింది.
చదవండి: 'ధోనీకి మాత్రమే రియల్ ఫ్యాన్స్‌.. మిగిలినందరికీ ఉన్నది పెయిడ్ ఫ్యాన్సే'
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement