
ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌కు ముందు గత సీజన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కీలక నిర్ణయం తీసుకుంది. సునీల్ జోషి (2023-2025) స్థానంలో భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేను (Sairaj Bahutule) కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది.

బహుతులే ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్ పదని నుంచి వైదొలిగాడు. తదుపరి సీజన్‌లో బహుతులే రికీ పాంటింగ్ (హెడ్ కోచ్) నేతృత్వంలోని కోచింగ్ బృందంలో చేరతాడు. ఈ టీమ్‌లో బ్రాడ్ హడ్డిన్, జేమ్స్ హోప్స్ అసిస్టెంట్ కోచ్‌లుగా ఉన్నారు.
బహుతులే చేరిక శ్రేయస్ (Shreyas Iyer) బృందానికి అదనపు బలాన్ని ఇస్తుందని పంజాబ్ మేనేజ్‌మెంట్ భావిస్తుంది. 51 ఏళ్ల బహుతులేకు దేశవాలీ క్రికెట్‌లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. అతను బెంగాల్, కేరళ, విదర్భ, గుజరాత్ జట్లకు కోచింగ్‌ను అందించాడు. భారత యువ బౌలర్లను తీర్చిదిద్దడంలో సాయిరాజ్‌ది అందవేసిన చెయ్యిగా చెబుతారు.
సాయిరాజ్ చేరికపై పంజాబ్ కింగ్స్ సీఈవో సతీష్ మీనన్ స్పందించాడు. అతని మాటల్లో.. "ముందుగా సునీల్ జోషికి కృతజ్ఞతలు. ఇప్పుడు బహుతులే చేరడం మాకు గర్వకారణం. అతని అనుభవం, వ్యూహాత్మక దృష్టి మా జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది".
పంజాబ్ కింగ్స్‌తో డీల్ ఖరారయ్యాక సాయిరాజ్ కూడా స్పందించాడు. పంజాబ్ కింగ్స్‌లో చేరడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ జట్టు ప్రత్యేకమైన క్రికెట్ ఆడుతుంది. యువ ప్రతిభను మెరుగుపరచడంలో నా పాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు.
కాగా, పంజాబ్ కింగ్స్ గత సీజన్ ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలై తృటిలో టైటిల్‌ను చేజార్చుకుంది. శ్రేయస్ అయ్యర్ గత సీజన్‌లోనే పంజాబ్ కింగ్స్ పగ్గాలు చేపట్టి అద్భుతంగా ముందుండి నడిపించాడు. వ్యక్తిగతంగానూ రాణించాడు. శ్రేయస్ అంతకుముందు సీజన్‌లో (2024) కేకేఆర్‌కు విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. గత సీజన్ వేలంలో శ్రేయస్‌ను పంజాబ్ యాజమాన్యం రికార్డు ధర వెచ్చించి సొంతం చేసుకుంది.
చదవండి: NZ VS ENG: సిరీస్ ఇంగ్లండ్ వశం.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా బ్రూక్