KKR Vs PBKS: వ‌రుణ్ స్పిన్‌ మ్యాజిక్‌.. మాక్స్‌వెల్ మైండ్ బ్లాంక్‌! వీడియో వైర‌ల్‌ | IPL 2025: Varun Chakaravarthy Dismiss Glenn Maxwell With Magical Bowling, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

KKR Vs PBKS: వ‌రుణ్ స్పిన్‌ మ్యాజిక్‌.. మాక్స్‌వెల్ మైండ్ బ్లాంక్‌! వీడియో వైర‌ల్‌

Apr 15 2025 10:32 PM | Updated on Apr 16 2025 1:25 PM

Varun Chakaravarthy breaches Glenn Maxwell

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో వ‌రుణ్ బంతితో మ్యాజిక్ చేశాడు. త‌న బౌలింగ్‌తో పంజాబ్ బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.

ముఖ్యంగా పంజాబ్ డేంజ‌ర‌స్ బ్యాట‌ర్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ను చ‌క్ర‌వ‌ర్తి ఔట్ చేసిన తీరు గురుంచి ఎంత చెప్ప‌కున్న త‌క్కువే. మాక్సీని అద్బుతమైన బంతితో వ‌రుణ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 10వ ఓవ‌ర్ వేసిన వ‌రుణ్‌.. తొలి బంతిని మాక్సీకి బ్యూటిఫూల్‌ గూగ్లీని సంధించాడు.

ఆ బంతిని మాక్స్‌వెల్ ఫ్రంట్ ఫుట్‌కు వ‌చ్చి షాట్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి అద్భుతంగా ట‌ర్న్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన మాక్స్‌వెల్ ఒక్క‌సారిగా బిత్త‌ర‌పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఈ మ్యాచ్‌లో వ‌రుణ్ త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో 21 ప‌రుగులిచ్చి 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఓవ‌రాల్‌గా ఈ ఏడాది సీజ‌న్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన వ‌రుణ్ 8 వికెట్లను త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ కేకేఆర్ బౌల‌ర్ల దాటికి 15.3 ఓవ‌ర్ల‌లో కేవలం 111 ప‌రుగులకే కుప్ప‌కూలింది. కేకేఆర్ బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రానా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, సునీల్ న‌రైన్ త‌లా రెండు వికెట్లు సాధించారు.వీరితో పాటు నోకియా, వైభ‌వ్ ఆరోరా చెరో వికెట్ సాధించారు. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్ర‌భుసిమ్రాన్ సింగ్‌(30) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ప్రియాన్ష్ ఆర్య‌(22), శ‌శాంక్ సింగ్‌(18) కాస్త ఫ‌ర్వాలేద‌న్పించారు. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌(0), గ్లెన్ మాక్స్‌వెల్‌(7) తీవ్ర నిరాశ‌ప‌రిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement