
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో సీఎస్‌కే ఓటమి పాలైంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి చెన్నై నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది.
సీఎస్‌కే బ్యాటర్లలో సామ్ కుర్రాన్(88) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు బ్రెవిస్(32) పరుగులతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో చాహల్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. చాహల్‌తో పాటు అర్ష్‌దీప్, జాన్సెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్..
అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో చేధించింది. పంజాబ్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 72 పరుగులు చేశాడు. అతడితో పాటు ప్రభ్‌సిమ్రాన్ సింగ్(54) హాఫ్ సెంచరీతో మెరిశాడు. సీఎస్‌కే బౌలర్లలో పతిరానా రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్,ఖాలీల్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.
చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన చాహల్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా