
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రద్దు అయింది. భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ను నిర్వహకులు రద్దు చేశారు. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల నడుమ స్ధానికంగా బ్లాక్ అవుట్ విధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు.
ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ ధుమాల్ స్వయంగా రంగంలోకి దిగి ప్రేక్షకులను స్టేడియం నుంచి బయటకు పంపించారు. జమ్మూలో జారీ చేయబడిన రెడ్ అలర్ట్ ఆధారంగా ముందు జాగ్రత్త చర్యగా ఈ మ్యాచ్‌ను రద్దు చేసినట్లు ధుమాల్ పేర్కొన్నారు. వర్షం కారణంగా గంట ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. పంజాబ్ స్కోర్ 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది.
ప్రియాన్ష్ ఆర్య ఔటైన వెంటనే స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో ఫ్లడ్ లైట్ల సమస్య తలెత్తడంతో మ్యాచ్ ఆగిపోయిందని అంతా భావించారు. కానీ భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ఉద్డేశ్వపూర్వకంగానే ఫ్లడ్ లైట్స్ ఆపి, మ్యాచ్ రద్దు చేశారు. అయితే టెక్నికల్ ఫెయిల్యూర్ కారణంగానే మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్టుగా బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. మ్యాచ్ రద్దు కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు చెరో పాయింట్ లభించింది.
#WATCH | Dharamshala: Sudhir, a cricket fan says, "The match has been called off because of security reasons. What do we have to be afraid of? We are in our country. If anyone, it should be Pakistan who should be afraid. Bharat Mata ki Jai." https://t.co/N3YDWolW07 pic.twitter.com/QjiNCQn9sZ
— ANI (@ANI) May 8, 2025
IPL Chairman requesting fans to leave the Dharamshala Stadium. pic.twitter.com/9rVqVfPa12
— Bhagavad Gita 🪷 (@Geetashloks) May 8, 2025