
ఐపీఎల్ ప్రారంభమైన నాటినుంచి తొలి టైటిల్ కోసం పోరాడుతూనే ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... ఈ సీజన్లో ట్రోఫీ దిశగా మరో ముందడుగు వేసింది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) క్వాలిఫయర్–1లోనూ సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ ఐపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను చిత్తుచేసి తుదిపోరుకు చేరింది.

బౌలర్లు సమష్టిగా సత్తా చాటడంతో ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టగా... 11 ఏళ్ల తర్వాత ‘ప్లే ఆఫ్స్’కు చేరిన పంజాబ్ బ్యాటర్ల వైఫల్యంతో పరాజయం వైపు నిలిచింది.

నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు

క్వాలిఫయర్–1లో 8 వికెట్లతో పంజాబ్ చిత్తు

రాణించిన సుయాశ్, హాజల్‌వుడ్, సాల్ట్





















Photo Courtesy: PTI