చ‌రిత్ర సృష్టించిన చాహల్‌.. తొలి బౌలర్‌గా రికార్డు | Yuzvendra Chahal Creates History, Equals Sunil Narines Twin Records | Sakshi
Sakshi News home page

IPL 2025: చ‌రిత్ర సృష్టించిన చాహల్‌.. తొలి బౌలర్‌గా రికార్డు

Apr 16 2025 6:43 PM | Updated on Apr 16 2025 6:56 PM

Yuzvendra Chahal Creates History, Equals Sunil Narines Twin Records

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో టీమిండియా వెట‌ర‌న్‌, పంజాబ్ కింగ్స్ స్టార్ స్పిన్న‌ర్‌ యుజ్వేంద్ర చాహల్ ఎట్ట‌కేల‌కు త‌న ఫామ్‌ను అందుకున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చాహ‌ల్ అద్భుతం చేశాడు. త‌న స్పిన్ మాయాజాలంతో పంజాబ్ కింగ్స్‌కు చారిత్ర‌త్మ‌క విజ‌యాన్ని చాహ‌ల్ అందించాడు.

ఓట‌మి త‌ప్ప‌దనుకున్న చోట చాహ‌ల్ త‌న బౌలింగ్‌తో మ్యాచ్ స్వ‌రూపాన్నే మార్చేశాడు.  అతడు 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఫ‌లితంగా 112 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కాపాడుకుని పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌లో అత్యల్ప స్కోరును డిఫెండ్ చేసిన జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన చాహ‌ల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

న‌రైన్ రికార్డు స‌మం..
ఐపీఎల్‌లో అత్య‌ధిక సార్లు 4 వికెట్ల హాల్ సాధించిన బౌల‌ర్‌గా సునీల్ న‌రైన్ రికార్డును చాహ‌ల్ స‌మం చేశాడు. ఇది చాహ‌ల్‌కు ఎనిమిదివ‌ 4 వికెట్ల హాల్. న‌రైన్ కూడా స‌రిగ్గా  8 సార్లు 4 వికెట్లు సాధించాడు. అయితే ఈ ఫీట్ సాధించిన తొలి ఇండియ‌న్ బౌల‌ర్ మాత్రం చాహ‌లే కావ‌డం గ‌మ‌నార్హం. అదే విధంగా ఐపీఎల్‌లో కేకేఆర్‌పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యుజీ నిలిచాడు. 

చాహ‌ల్ ఇప్ప‌టివ‌ర‌కు కేకేఆర్‌పై 23 మ్యాచ్‌ల్లో 7.96 ఎకానమీ రేటుతో 33 వికెట్లు పడగొట్టాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు భువ‌నేశ్వ‌ర్ కుమార్(32) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో భువీ అల్‌టైమ్ రికార్డును యుజీ బ్రేక్ చేశాడు. కాగా ఐపీఎల్‌లో లీడింగ్ వికెట్ టేక‌ర్ చాహ‌ల్ (211) లీడింగ్ వికెట్ టేక‌ర్ కొన‌సాగుతున్నాడు.
చ‌దవండి: IPL 2025: మ్యాచ్ ఫిక్సింగ్ ముప్పు.. ఐపీఎల్ టీమ్స్‌కు బీసీసీఐ అలెర్ట్‌?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement