చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్‌.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు | Sai Sudharsan Creates History, Breaks Virat Kohlis Record | Sakshi
Sakshi News home page

IPL 2026: చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్‌.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు

May 12 2026 10:46 PM | Updated on May 12 2026 10:46 PM

Sai Sudharsan Creates History, Breaks Virat Kohlis Record

ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ సాయి సుదర్శన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో సుదర్శన్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఆరంభంలోనే  శుభ్‌మన్ గిల్‌, జోస్ బట్లర్ వికెట్లను కోల్పోయిన గుజరాత్‌ను సుదర్శన్ ఆదుకున్నాడు.

ఈ తమిళనాడు క్రికెటర్‌ 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడు ఐపీఎల్‌-2026 సీజన్‌లో 500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా సుదర్శన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

👉ఐపీఎల్ చరిత్రలో 24 ఏళ్ల వయసులోపు మూడు వేర్వేరు సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించిన మొదటి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ ఫీట్ ఎవరూ సాధించలేకపోయారు. ఇంతకుముం‍దు ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి 24 ఏళ్ల వయసులోపు  రెండు సీజన్లలో 500 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.

👉అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలో వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించిన నాల్గవ ఆటగాడిగా సుదర్శన్ నిలిచాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ (2014-2017), కె.ఎల్. రాహుల్ (2018-2021), విరాట్ కోహ్లి (2023-2025), సాయి సుదర్శన్ (2024-2026) ఉన్నారు.

👉గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున మూడుసార్లు 500+ పరుగులు చేసిన మొదటి ఆటగాడు కూడా సుదర్శనే కావడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement