చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు | Virat Kohli Creates History vs PBKS, Becomes The 1st Ever Batsman In IPL History | Sakshi
Sakshi News home page

IPL 2026: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు

May 17 2026 5:14 PM | Updated on May 17 2026 5:48 PM

Virat Kohli Creates History vs PBKS, Becomes The 1st Ever Batsman In IPL History

ఐపీఎల్‌-2026లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ ఓపెన‌ర్ విరాట్ కోహ్లి త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఆదివారం ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి అద్భుత‌మైన హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. కింగ్‌ కోహ్లి 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లి పలు సరికొత్త రికార్డులను లిఖించుకున్నాడు.  

19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ తరపున ఓపెనర్‌గా 5500 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా విరాట్ రికార్డు సృష్టించాడు. ఆర్సీబీ తరపున కోహ్లి ఓపెనర్‌గా 5500 పరుగులు సాధించాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

అంతకముందు శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ వంటి ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఓపెనర్లుగా 5500 పరుగుల మార్కును దాటినప్పటికీ.. వారు వేర్వేరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించారు. కానీ కోహ్లి మాత్రం కేవలం ఆర్సీబీ తరుపున ఆడుతూ ఈ ఘనత సాధించాడు.

అదేవిధంగా ఐపీఎల్‌లో ఒకే  జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లి తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. పంజాబ్ కింగ్స్‌పై కోహ్లి ఇప్పటివరకు 1175కు పైగా పరుగులు చేశాడు. ఇంతకముందు కోహ్లి చెన్నై సూపర్ కింగ్స్‌పై 1174 ప‌రుగులు చేశాడు.

ఐపీఎల్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు:

1175 పరుగులు – విరాట్ కోహ్లి (vs పంజాబ్ కింగ్స్)

1174 పరుగులు – విరాట్ కోహ్లి (vs చెన్నై సూపర్ కింగ్స్)  

1172 పరుగులు – విరాట్ కోహ్లి (vs ఢిల్లీ క్యాపిటల్స్)  

1161 పరుగులు – రోహిత్ శర్మ (vs కోల్‌కతా నైట్ రైడర్స్)  

1134 పరుగులు – డేవిడ్ వార్నర్ (vs పంజాబ్ కింగ్స్)  

ఈ ఇన్నింగ్స్‌తో  కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్‌లో తన 500 పరుగుల మార్కును కూడా దాటేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 9 సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఏకైక బ్యాటర్‌గా కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

అత్యధిక సార్లు ఐపీఎల్ సీజన్లలో 500 ప్ల‌స్ ర‌న్స్ చేసిన ప్లేయ‌ర్లు వీరే
9 సీజన్లు – విరాట్ కోహ్లీ  

7 సీజన్లు – డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్  

5 సీజన్లు – శిఖర్ ధావన్
చదవండి: PAK vs BAN: బాబర్‌ ఆజం అరుదైన రికార్డు
 

Advertisement
 
Advertisement
Advertisement