పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం తన పునరాగమనంలో సత్తాచాటాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు గాయం కారణంగా దూరమైన బాబర్.. ఇప్పుడు రెండో టెస్టులో మాత్రం అద్భుతమైన నాక్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులకే ఓపెనర్లు వికెట్లు కోల్పోయిన పాక్‌ను హాఫ్ సెంచరీతో బాబర్ ఆదుకున్నాడు.
కెప్టెన్ షాన్ మసూద్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 84 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో అతడు 68 పరుగులు చేశాడు. బాబర్‌కు ఇది 31వ టెస్ట్ హాఫ్ సెంచరీ. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మాత్రం అతడికి ఇది 20 ఆర్ధ శతకం కావడం గమనార్హం. ఈ క్రమంలో బాబర్ ఓ అరుదైన ఘనత సాధించాడు.
డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక అర్ధశతకాల జాబితాలో స్మిత్, జాక్ క్రాలీలతో కలిసి బాబర్ మూడో స్ధానంలో నిలిచాడు. మరో హాఫ్ సెంచరీ సాధిస్తే వారిద్దరిని బాబర్ అధిగమిస్తాడు. బాబర్ కంటే ముందు మార్నస్ లబుషేన్(24), జో రూట్(22) ఉన్నారు. ఇక సిల్హాట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 278 పరుగులకే ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ 232 పరుగులకే కుప్పకూలింది.
దీంతో బంగ్లాకు 46 పరుగుల ఆధిక్యం లభించింది. బంగ్లా వికెట్ కీపర్ బ్యాటర్ లిట్టన్ దాస్((126) వీరోచిత శకతం సాధించాడు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్ మూడు వికెట్లు, హసన్ అలీ రెండు వికెట్లు సాధించారు.
చదవండి: ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..!


