Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) 82 పరుగుల తేడాతో దారుణ ఓటమిని చవిచూసింది. గుజరాత్ విధించిన 169 పరుగులను ఛేదించే క్రమంలో ఎస్ఆర్‌హెచ్ 86 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్‌హెచ్ పలు చెత్త రికార్డులను తన పేరిట లిఖించుకుంది. అవి ఏంటనేది ఒకసారి పరిశీలిద్దాం.
👉గుజరాత్‌తో మ్యాచ్‌లో 89 పరుగులకే కుప్పకూలిన ఎస్ఆర్‌హెచ్‌కు ఐపీఎల్‌లో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. 2019లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 96 పరుగులు, 2015లో ముంబైతో మ్యాచ్‌లో 113 పరుగులు, 2024లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో 113 పరుగులు, 2020 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 114 పరుగులకు ఆలౌటైంది.
👉ఐపీఎల్‌లో పరుగుల పరంగా (గుజరాత్ చేతిలో 82 పరుగుల తేడాతో) చూసుకుంటే ఎస్ఆర్‌హెచ్‌కు ఇదే అతిపెద్ద ఓటమి. 2025లో కేకేఆర్ చేతిలో 80 పరుగులు, 2024లో సీఎస్‌కే చేతిలో 78 పరుగులు, 2013లో సీఎస్‌కే చేతిలో 77 పరుగులు, 2014లో పంజాబ్ చేతిలో 72 పరుగులు, 2023లో రాజస్తాన్ చేతిలో 72 పరుగులతో భారీ ఓటములు చవిచూసింది.
👉అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఎస్ఆర్‌హెచ్ చేసిన 86 పరుగులే అత్యల్ప స్కోరు. గతంలో గుజరాత్ టైటాన్స్ (2024లో ఢిల్లీతో మ్యాచ్‌లో 89 పరుగులు) ఇప్పటిదాకా అత్యల్పం. అంతకముందు ఇదే సీజన్‌లో ముంబైతో మ్యాచ్‌లో గుజరాత్ వంద పరుగులకు ఆలౌటైంది. 2014లో ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ 102 పరుగులకు ఆలౌటైంది.
👉ఐపీఎల్‌లో పరుగుల పరంగా గుజరాత్ టైటాన్స్‌కు (82 పరుగులు) ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ సీజన్‌లో రాజస్తాన్‌పై 77 పరుగులతో, 2023లో ముంబైపై 62 పరుగులతో, 2022లో లక్నోపై 62 పరుగులతో, 2025లో రాజస్తాన్‌పై 58 పరుగులతో భారీ విజయాలు అందుకుంది.
👉ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచి ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఎస్ఆర్‌హెచ్ మిగిలిన రెండు మ్యాచ్‌లను సీఎస్‌కే, ఆర్సీబీతో ఆడనుంది. ఇందులో ఆర్సీబీతో మ్యాచ్‌ను సొంత గ్రౌండ్‌లో ఆడనుండడం ఎస్ఆర్‌హెచ్‌కు కలిసొచ్చే అంశం. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఎస్ఆర్‌హెచ్ నెగ్గితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరనుంది.


