కోల్‌కతాపై బెంగళూరు విజయం | IPL 2026 KKR Vs RCB, Royal Challengers Bengaluru Won By 6 Wickets And Virat Kohli Smashes Century | Sakshi
Sakshi News home page

RCB Vs KKR: కోల్‌కతాపై బెంగళూరు విజయం

May 14 2026 12:47 AM | Updated on May 14 2026 11:19 AM

 IPL 2026 KKR vs RCB Royal Challengers Bengaluru won by 6 wkts virat kohli century

ఐపీఎల్‌-2026 సీజన్‌లో కీలక పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసి విజయం అందుకుంది.

విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో ఆర్‌సీబీని విజయ తీరాలకు చేర్చాడు. ఈ విజయంతో సీజన్‌లో 8వ విజయంతో ప్లేఆఫ్స్ రేసుకి మరింత చేరువైంది ఆర్‌సీబీ. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement