ప్రపంచ కప్ హీరోకు రూ.కోటి బహుమతి | Ishan Kishan, Sakib Hussain Honoured By Bihar CM While Performing For SRH | Sakshi
Sakshi News home page

Ishan Kishan: ప్రపంచ కప్ హీరోకు రూ.కోటి బహుమతి

May 15 2026 8:21 PM | Updated on May 15 2026 8:28 PM

Ishan Kishan, Sakib Hussain Honoured By Bihar CM While Performing For SRH

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026లో టీమిండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్‌ను బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఘనంగా సన్మానించారు. ఈ సంద‌ర్భంగా కిష‌న్‌కు కోటి రూపాయల చెక్‌ను ఆయన అందించారు. పాట్నాలో జన్మించిన ఇషాన్ కిషన్ తమ అద్భుత ప్రదర్శనలతో రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో కిషన్ దుమ్ములేపాడు. ఈ టోర్నమెంట్‌లో ఇషాన్ 9 ఇన్నింగ్స్‌ల్లో 317 పరుగులు సాధించాడు. అతడు ఏకంగా 193.29 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. ఇషాన్  కిషన్ 2024లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయినప్పటికీ, పట్టుదలతో దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటి తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు.

తనకు లభించిన రెండో అవకాశాన్ని కిషన్ సద్వినియోగపరుచుకున్నాడు. ఇప్పుడు భారత టీ20 జట్టులో కీలక సభ్యునిగా మారాడు. ఇప్పుడు వన్డే జట్టులోకి పునరాగమనం చేసేందుకు కిషన్ సిద్దమయ్యాడు. ఇక సీఎం సామ్రాట్ చౌదరి కేవలం ఇషాన్ కిషన్‌నే కాకుండా, ఎస్‌ఆర్‌హెచ్ పేసర్ షకీబ్ హుస్సేన్ కూడా సత్కరించారు.

షకీబ్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే రాజస్తాన్ రాయల్స్‌పై 4 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. కాగా కిషన్‌ పాట్నాలో పుట్టినప్పటికి ఫస్ట్‌ క్రికెట్‌ మాత్రం జార్ఖండ్‌ తరపున ఆడుతున్నాడు.
చదవండి: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌..! వైభవ్‌, భువీకి ఛాన్స్‌?

Advertisement
 
Advertisement
Advertisement