Samrat Choudhary
-
ఇది బిహార్ సీఎం సమ్రాట్ చౌధరి చిత్రపటమా? ఇలా ఉందేంటి?
పట్నా: బిహార్ సీఎం సమ్రాట్ చౌధరికి పట్నాకు చెందిన బిల్డర్ సంజీవ్ శ్రీవాస్తవ్ బహుమతిగా ఇచ్చిన కార్టూన్ శైలిలోని ఓ చిత్రపటం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు భారీగా మీమ్స్ సృష్టిస్తూ, సెటైర్లు వేస్తున్నారు.పట్నాకు చెందిన పాల్వి రాజ్ కన్స్ట్రక్షన్ సంస్థ అధినేత సంజీవ్ శ్రీవాస్తవ్ విలాసవంతమైన జీవనశైలితో ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమావేశానికి సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే చిత్రపటంపై విపరీతమైన చర్చ మొదలైన తర్వాత ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతాను ప్రైవేట్‌గా మార్చారు.సంజీవ్ ఆ నలుపు-తెలుపు పెన్సిల్/చార్కోల్ చిత్రంలో సమ్రాట్ చౌధరి ముఖాన్ని అతిశయంగా చూపించారు. పెద్ద కళ్లతో పాటు మందమైన గడ్డం, బాగా హైలైట్ చేసిన నుదురు, పెద్ద కార్టూన్ తరహా చెవులు, పొడవైన కనురెప్పలు చిత్రంలో కనిపించాయి. ఈ చిత్రాన్ని ఎవరు వేశారన్న విషయం స్పష్టంగా తెలియకపోయినా, కుటుంబానికి దగ్గరగా ఉన్నవారే గీసి ఉండొచ్చని సోషల్ మీడియా యూజర్లు అంటున్నారు. చిత్రపటంతో పాటు శ్రీవాస్తవ్ మరికొన్ని బహుమతులను కూడా ముఖ్యమంత్రికి అందించారు.నెటిజన్ల స్పందనలుఆ చిత్రం అసలు సమ్రాట్ చౌధరిలా లేదంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. బాలీవుడ్ సినిమా వెల్కమ్లో కనిపించిన “మజ్ను భాయ్” పెయింటింగ్‌తో ఈ చిత్రాన్ని పోల్చారు.ఓ ఎక్స్ యూజర్ స్పందిస్తూ.. “ఈ వ్యక్తి బిహార్ సీఎం సమ్రాట్ చౌధరికి ఇచ్చింది పెయింటింగ్ అని అసలు చెప్పలేం. సమ్రాట్ చౌధరి మంచి మనిషి కాబట్టే ఆయనకు ఈ విచిత్ర చిత్రాన్ని ధైర్యంగా అందించి కూడా సురక్షితంగా బయటపడ్డాడు” అని సెటైర్ వేశారు. వేరే నేత అయితే ఈ చిత్రం ఇచ్చిన వారిని శిక్షించే వారని అన్నారు.మరో వ్యక్తి స్పందిస్తూ.. “మజ్ను భాయ్ గర్వపడేవాడు. బిహార్ నిర్మాణ సంస్థ డైరెక్టర్.. సీఎం సమ్రాట్ చౌధరిని కలిసి ఈ కళాఖండాన్ని పూర్తి నమ్మకంతో బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత నాలుగు ఫొటోలను గర్వంగా సోషల్ మీడియాలో పెట్టాడు” అని పేర్కొన్నాడు. “తప్పుడు రూపం చూపించారని కేసు వేస్తారా?” అని ఓ వ్యక్తి ప్రశ్నించారు.In Patna, builder Sanjeev Shrivastav gifted a sketch to Bihar CM Samrat Chaudhary. pic.twitter.com/gg4hqdkbxG— 🚨Indian Gems (@IndianGems_) May 27, 2026A Builder gifts a sketch to Bihar CM Samrat Choudhary and the CM himself looks confused about whose sketch it actually is When Picaso of Patna came to meet CM Samrat Chaudhary last week.#samratsarkar pic.twitter.com/xdunbsZMY8— Raajeev Chopra (@Raajeev_Chopra) May 27, 2026Ee Kashtam pagodiki kuda rakudadhu 😂🤣🤣🤣😂🤣😂😂🤣😂In Patna, builder Sanjeevi Shrivastav gifted a sketch to Bihar CM Samrat Chaudhary pic.twitter.com/kRoNlgoMMV— Swaasthi (@swaasthi_) May 27, 2026 -
ప్రపంచ కప్ హీరోకు రూ.కోటి బహుమతి
టీ20 వరల్డ్‌కప్-2026లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్‌కు కోటి రూపాయల చెక్‌ను ఆయన అందించారు. పాట్నాలో జన్మించిన ఇషాన్ కిషన్ తమ అద్భుత ప్రదర్శనలతో రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో కిషన్ దుమ్ములేపాడు. ఈ టోర్నమెంట్లో ఇషాన్ 9 ఇన్నింగ్స్‌ల్లో 317 పరుగులు సాధించాడు. అతడు ఏకంగా 193.29 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. ఇషాన్ కిషన్ 2024లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయినప్పటికీ, పట్టుదలతో దేశవాళీ క్రికెట్లో సత్తాచాటి తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు.తనకు లభించిన రెండో అవకాశాన్ని కిషన్ సద్వినియోగపరుచుకున్నాడు. ఇప్పుడు భారత టీ20 జట్టులో కీలక సభ్యునిగా మారాడు. ఇప్పుడు వన్డే జట్టులోకి పునరాగమనం చేసేందుకు కిషన్ సిద్దమయ్యాడు. ఇక సీఎం సామ్రాట్ చౌదరి కేవలం ఇషాన్ కిషన్‌నే కాకుండా, ఎస్ఆర్హెచ్ పేసర్ షకీబ్ హుస్సేన్ కూడా సత్కరించారు.షకీబ్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే రాజస్తాన్ రాయల్స్‌పై 4 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. కాగా కిషన్ పాట్నాలో పుట్టినప్పటికి ఫస్ట్ క్రికెట్ మాత్రం జార్ఖండ్ తరపున ఆడుతున్నాడు.చదవండి: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..! వైభవ్, భువీకి ఛాన్స్? -
Bihar: ఎన్‌కౌంటర్‌తో సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
సుల్తాన్‌గంజ్: బిహార్ రాజకీయ ముఖచిత్రంలో ఇప్పుడు తుపాకుల మోత వినిపిస్తోంది. పట్టపగలు జరిగిన ఓ దారుణ హత్యకు.. కొద్ది గంటల వ్యవధిలోనే ఎన్కౌంటర్ రూపంలో పోలీసులు ముగింపు పలికారు. సుల్తాన్‌గంజ్ మున్సిపల్ కౌన్సిల్ ఆఫీసులో జరిగిన రక్తపాతానికి ప్రతీకారంగా జరిగిన ఈ భాగల్పూర్ ఎన్కౌంటర్.. రాష్ట్రంలో నేరస్తులకు కొత్త ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఇస్తున్న స్పష్టమైన, కఠినమైన హెచ్చరికగా మారింది.పట్టపగలు హత్య.. గంటల్లోనే ఎన్కౌంటర్సుల్తాన్గంజ్ మున్సిపల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృష్ణ భూషణ్ కుమార్‌ను దారుణంగా కాల్చి చంపిన ప్రధాన నిందితుడు రామ్‌ధాని యాదవ్‌ను పోలీసులు అదే వేగంతో మట్టుబెట్టారు. ఆ దాడిలో చైర్మన్ రాజ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకునేందుకు నిందితుడిని తీసుకెళ్తుండగా, అతను పోలీసులపైకి కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రామ్‌ధాని ఆసుపత్రిలో మరణించగా, ముగ్గురు పోలీసులు సైతం గాయపడి చికిత్స పొందుతున్నారు.రాజకీయ రగడ.. విపక్షాల ఆరోపణలుఈ ఎన్కౌంటర్ బీహార్‌లో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. మృతి చెందిన నేరస్తుడికి బీజేపీ నేతలతో సంబంధాలు ఉన్నాయంటూ ఫోటోలను పంచుకున్న ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్, ప్రభుత్వమే నేరస్తులను కాపాడుతోందని ఆరోపించారు. అయితే అధికార ఎన్డీఏ పక్షాలు ఈ విమర్శలను తీవ్రంగా తిప్పికొట్టాయి. చట్టం తన పని తాను చేసుకుపోతోందని బీజేపీ పేర్కొనగా.. ‘ఇది కొత్త బీహార్, ఇక్కడ తూటాకు ఫిరంగితోనే సమాధానం చెబుతాం’ అని కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ స్పష్టం చేస్తూ పోలీసుల చర్యను సమర్థించారు.‘యూపీ మోడల్’ దిశగా కొత్త ప్రభుత్వంఈ ఘటనను అత్యంత విచారకరంగా వర్ణించిన ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, మృతుని కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారాన్ని, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ అవలంబించిన కఠినమైన విధానాన్ని ఇప్పుడు బీహార్ ప్రభుత్వం కూడా అమలు చేస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. భాగల్పూర్ ఎన్కౌంటర్.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాలపై ఉక్కుపాదం మోపడానికి కొత్త ప్రభుత్వ తొలి అడుగుగా నిలిచింది.ఇది కూడా చదవండి: కప్పు టీ.. కోటిన్నర విరాళం: ఆశ్రమం కోసం అద్భుతం -
Bihar: సొంత ఇంటి మెట్లనే కూల్చేసుకున్న సీఎం!
పట్నా: బిహార్‌లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి.. ఈ తరహా చర్యలను తన సొంత ఇంటి నుంచే ప్రారంభించి, అందరినీ ఆశ్యర్యానికి గురిచేశారు. ముఖ్యమంత్రి ఇంటి మీదకు బుల్డోజర్లు వెళ్లడం సంచలనంగా మారింది.సీఎం సొంత ఇంటిపైకే బుల్డోజర్ముంగేర్ జిల్లా తారాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం సామ్రాట్ చౌదరి సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన తన సొంత ఇంటి మెట్లను సైతం అధికారులు కూల్చివేస్తున్నారని ఆయన వెల్లడించారు. ‘వ్యక్తిగత భూమిలో ఇల్లు కడితే ఎలాంటి ఇబ్బందీ లేదు, కానీ ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపడితే అది ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన, అందమైన బిహార్ నిర్మాణానికే ఈ కఠిన చర్యలని స్పష్టం చేశారుఅధికారులకు అల్టిమేటంసామాన్యుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెలా పంచాయతీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. అదే సమయంలో ప్రభుత్వ అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏ అధికారి అయినా ఒక ఫైలును నెల రోజులకుపైగా పెండింగ్‌లో పెడితే, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్లాక్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లలో పెండింగ్ పనులపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో, ఇకపై సీఎంవో నేరుగా ఆయా కార్యాలయాలను పర్యవేక్షిస్తుందని చెప్పారు.మోదీ కలల ప్రాజెక్టు.. నితీష్ కుమార్‌కు ప్రశంసలుబీహార్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చాలన్న ప్రధానమంత్రి కలను నెరవేర్చి తీరుతామని సామ్రాట్ చౌదరి ఉద్ఘాటించారు. 20 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసి ఏప్రిల్ 14న రాజీనామా చేసిన నితీష్ కుమార్ గతంలో చేసిన అభివృద్ధి పనులను ఆయన ప్రశంసించారు. అయితే ఆ అభివృద్ధి వేగాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని కొత్త సీఎం అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 15న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, తొలి సభలోనే తన మార్క్ పరిపాలనను చూపారు.ఇది కూడా చదవండి: బీజేపీ అభ్యర్థి ఇంటివద్ద బాంబుల మోత -
బిహార్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం
అధికారం కోసం రాజకీయ నేతల వారసులు ఎగబడుతున్న ప్రస్తుత రోజుల్లో బిహార్ మాజీ సీఎం నితీశ్ కుమార్ తనయుడు నిశాంత్ భిన్నంగా వ్యవహరించారు. డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం వచ్చినా కాదనుకున్నారు. ప్రజల నమ్మకాన్ని పొందిన తర్వాతే పదవి చేపట్టాలని, అప్పటి వరకు జనం మధ్య ఉండేందుకే ఆయన మొగ్గుచూపారు. బిహార్‌లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు (Bihar Politics) మరో మలుపు తిరిగాయి. నితీశ్ కుమార్ సీఎం పదవిని వదిలిపెట్టి హస్తిన బాట పట్టడంతో కాషాయపార్టీకి తొలిసారి బిహార్ ముఖ్యమంత్రి పీఠం దక్కింది. అయితే నితీశ్ ఢిల్లీకి వెళ్తూ తన కొడుకు నిశాంత్ కుమార్‌ను బిహార్ కేబినెట్లోకి ప్రవేశపెడతారన్న వార్తలు షికారు చేశాయి. జేడీ(యూ) సీనియర్ నాయకులు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర యాదవ్‌లు బుధవారం సమ్రాట్ చౌదరితో కలిసి ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ ఊహాగానాలకు తెరపడిపోయింది. నితీశ్ వారసుడిగా కాకుండా తను తానుగా పదవి సంపాదించుకోవాలనే ఆలోచనలో ఉన్నారని జేడీ(యూ) పార్టీ వర్గాలు వెల్లడించాయి.పార్టీకే పరిమితమవుతాఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని నిశాంత్ కుమార్‌ను ఒప్పించేందుకు పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే తాను డిప్యూటీ సీఎం కావడానికి ఇంకా సమయం ఉందని పార్టీ నేతలకు ఆయన చెప్పారు. కొంతకాలం పార్టీకే పరిమితమవుతానని స్పష్టంచేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని నిశాంత్‌ను కోరుతూ మంగళవారం అర్ధరాత్రి వరకు పార్టీ నాయకులు చర్చలు జరిపారు. కానీ ఆయన ససేమీరా అన్నారు. డిప్యూటీ సీఎం పదవి చేపట్టేందుకు అవసరమైన అనుభవం తనకు ఇంకా రాలేదంటూ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు.తన భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి పార్టీ కార్యకర్తలు, ప్రజలతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నారు. కేత్రస్థాయిలో పనిచేయడం ద్వారా అనుభవం గడించాలని ఆయన భావిస్తున్నారు. ఈ అనుభవం ప్రభుత్వాన్ని ఎలా నడపాలో అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందని నిశాంత్ నమ్ముతున్నారు. అయితే నితీశ్ కుమార్ వారసత్వాన్ని సజీవంగా ఉంచడానికి నిశాంత్.. డిప్యూటీ సీఎం అయితే బాగుండేదని పార్టీలోని ఒక వర్గం భావిస్తోందని జేడీ(యూ) సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు.ఆరు నెలల తర్వాతే పదవి!ఆరు నెలల పాటు తాను ఏ పదవినీ స్వీకరించే అవకాశం లేదని నిశాంత్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. 44 ఏళ్ల నిశాంత్ కుమార్ గత నెలలో అధికారికంగా జేడీ(యూ)లో చేరారు. ఆయన పార్టీలో చేరే సమయంలో ఆయన తండ్రి నితీశ్ కుమార్ అక్కడ లేకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. నితీశ్, నిశాంత్ ఎల్లప్పుడూ వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించారని, అందుకే నిశాంత్ ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్నాకే పదవి చేపట్టాలని కోరుకుంటున్నారని పార్టీ నాయకుడొకరు అన్నారు. "తన తండ్రి రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాతే నిశాంత్ బిహార్ రాజకీయాల్లోకి వచ్చారు. నితీశ్ కుమార్ ఇప్పుడు ఢిల్లీకి మారినందున, పార్టీని బలోపేతం చేయడంపై నిశాంత్ కుమార్ దృష్టి పెట్టాలనుకుంటున్నారు" అని వివరించారు.చదవండి: కేరళ ఎన్నికల్లో జరుగుతోంది ఇదే!నిశాంత్ నెగ్గుకొస్తారా?నితీశ్ కుమార్ హస్తిన బాట పట్టడంతో బిహార్‌లో జేడీ(యూ) భవిష్యత్తు మన్ముందు ఎలా ఉండబోతోందో ఊహించడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ వ్యూహాలను తట్టుకుని పార్టీని కాపాడుకోవడం కత్తి మీద సామేనేనని అభిప్రాయపడుతున్నారు. బిహార్ కేబినెట్లో నిశాంత్ చేరితేనే బాగుండేదని పేర్కొంటున్నారు. ఆరు నెలలు అనుభవం గడించిన తర్వాత పదవి తీసుకుంటానని చెప్పడం ఇప్పటి రాజకీయాలకు సూటుకాదంటున్నారు. ఎందుకంటే 6 నెలల తర్వాత పరిస్థితులను ఎవరూ ఊహించలేరని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిశాంత్ ఎలా నెగ్గుకొస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
సామ్రాట్ చౌదరి అనే నేను.. సీఎంగా
పట్నా: బిహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో బిహార్‌లో బీజేపీ పార్టీ తరపున ప్రమాణ స్వీకారం చేసిన తొలి సీఎంగా సామ్రాట్ చౌదరి రికార్డు సాధించారు.కాగా నిన్న మాజీ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి పేరును ఎన్డీఏ ప్రకటించింది. పట్నాలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సామ్రాట్ చౌదరిని ఎన్నుకున్నారు. సామ్రాట్ చౌదరి నేపథ్యం సామ్రాట్ చౌదరి 1968 నవంబర్ 16న ముంగేర్ జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి శకుని చౌదరి తారాపూర్ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తల్లి పార్వతీ దేవి 1998లో అదే స్థానంలో అప్పటి సమతా పార్టీ తరఫున గెలిచారు. గత 12 ఎన్నికల్లో 9 సార్లు తండ్రి, తల్లి, కుమారుడు కలిసి ఆ స్థానంలో గెలిచారు.సామ్రాట్ చౌదరికి 57 ఏళ్లు 1990లో రాజకీయ ప్రవేశం చేశారు. 1999లో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి ప్రభుత్వం నడిపిన సమయంలో, బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు సామ్రాట్ వ్యవసాయ మంత్రి అయ్యారు. 2000, 2010 ఎన్నికల్లో పర్బట్టా అసెంబ్లీ స్థానంలో గెలిచారు. 2010లో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చీఫ్ విప్‌గా ఉన్నారు. 2023 మార్చి నుంచి 2024 జూలై వరకు బీజేపీ బిహార్ యూనిట్ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్రంలో క్రీడలు, ఆర్థిక, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి-గృహ నిర్మాణ శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. రాజకీయ, పరిపాలనా అనుభవం ఆయనకు ఉంది. ఆయన కుశ్వాహా సామాజిక వర్గానికి చెందినవారు. ఇది రాష్ట్ర జనాభాలో సుమారు 4.3 శాతం. బిహార్‌లో యాదవుల తర్వాత అతిపెద్ద ఓబీసీ వర్గం ఇదే. -
బిహార్ సీఎంగా సమ్రాట్
పట్నా: బిహార్ తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి(57) బాధ్యతలు చేపట్టనున్నారు. జేడీయూ చీఫ్, సీఎంగా రెండు దశాబ్దాలపాటు కొనసాగిన నితీశ్ కుమార్(75) మంగళవారం పదవికి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీ చీఫ్ నితిన్ నబీన్, తదితరుల సమక్షంలో జరిగిన బీజేపీ శాసనసభా పక్షం ఉపముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరిని తమ నేతగా ఎన్నుకుంది. ఆపై, ఎన్డీఏ పక్షం ఎమ్మెల్యేల భేటీలో చౌదరిని ఏకగ్రీవంగా తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. బిహార్ తదుపరి సీఎంగా సమ్రాట్ చౌదరి బుధవారం ఉదయం 11 గంటలకు ప్రమాణం చేయనున్నారని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రకటించారు.ఆయనతోపాటు మంత్రులుగా కొందరు ప్రమాణం చేసే అవకాశముందన్నారు. కాగా, స్వయంగా నితీశే తనను శాసనసభా పక్ష నేతగా ప్రతిపాదించారని అనంతరం చౌదరి మీడియాకు తెలిపారు. సమ్రాట్ చౌదరికి బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ అభినందనలు తెలిపారు. రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నట్లు గత నెలలో నితీశ్ ప్రకటించినప్పటి నుంచి తదుపరి సీఎంగా సమ్రాట్ చౌదరి పేరే ప్రముఖంగా వినిపించింది.పలువురు బీజేపీ సీనియర్ నేతలు ఆయనకు మద్దతు ప్రకటించారు. మంగళవారం జరిగిన కీలక భేటీలో డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా, సీనియర్ నేతలు మంగళ్ పాండే, దిలీప్ జైశ్వాల్, రేణు దేవి సీఎల్పీ నేతగా సమ్రాట్ పేరును ప్రతిపాదించగా కేంద్ర పరిశీలకుడిగా హాజరైన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలిపారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా సమ్రాట్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. -
బిహార్ కొత్త సీఎం ఈయనే.. అధికారిక ప్రకటన
పట్నా: బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ మంగళవారం రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి పేరును ఎన్డీఏ ప్రకటించింది. పట్నాలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సామ్రాట్ చౌదరిని ఎన్నుకున్నారు.సామ్రాట్ చౌదరి బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకోనున్నారు. త్వరలో గవర్నర్‌ను కలిసి తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు విజ్ఞప్తి చేయనున్నారు. బుధవారం (ఏప్రిల్ 15న) సీఎంగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.సామ్రాట్ చౌదరి ఎవరు? సామ్రాట్ చౌదరి 1968 నవంబర్ 16న ముంగేర్ జిల్లాలో జన్మించారు. ఆయనకు బలమైన రాజకీయ వారసత్వం ఉంది. ఆయన తండ్రి శకుని చౌదరి తారాపూర్ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తల్లి పార్వతీ దేవి 1998లో అదే స్థానంలో అప్పటి సమతా పార్టీ తరఫున గెలిచారు. గత 12 ఎన్నికల్లో 9 సార్లు తండ్రి, తల్లి, కుమారుడు కలిసి ఆ స్థానంలో గెలిచారు.సామ్రాట్ చౌదరికి 57 ఏళ్లు 1990లో రాజకీయ ప్రవేశం చేశారు. 1999లో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి ప్రభుత్వం నడిపిన సమయంలో, బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు సామ్రాట్ వ్యవసాయ మంత్రి అయ్యారు. 2000, 2010 ఎన్నికల్లో పర్బట్టా అసెంబ్లీ స్థానంలో గెలిచారు. 2010లో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చీఫ్ విప్‌గా ఉన్నారు. 2023 మార్చి నుంచి 2024 జూలై వరకు బీజేపీ బిహార్ యూనిట్ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్రంలో క్రీడలు, ఆర్థిక, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి-గృహ నిర్మాణ శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.సీఎం పదవికి అవసరమైన రాజకీయ, పరిపాలనా అనుభవం ఆయనకు ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు వంటి అన్ని అంశాల్లో అనుభవం ఉంది. ఆయన కుశ్వాహా సామాజిక వర్గానికి చెందినవారు. ఇది రాష్ట్ర జనాభాలో సుమారు 4.3 శాతం. బిహార్‌లో యాదవుల తర్వాత అతిపెద్ద ఓబీసీ వర్గం ఇదే. -
నితీశ్ కుమార్ రాజీనామా.. కొత్త సీఎం ఆయనేనా?
పాట్నా: బిహార్ సీఎం ఎవరు అనే అంశం నేడు తేలనుంది. ఈ రోజు ఏన్డీఏ కూటమి అధికారిక సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఈ అంశమై ఇదివరకే కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ని పరిశీలకుడిగా బీజేపీ పార్టీ నియమించింది. అయితే ఆ రాష్ట్రానికి ఎంతో కాలంగా ముఖ్యమంత్రిగా సేవలందించిన నితీశ్ కుమార్ ఈ రోజు సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు.బిహార్ రాష్ట్రంలో నూతన శకం ఆవిష్కృతం కాబోతుంది. బీజేపీ నాయకుడు తొలిసారిగా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ అంశమై నేడు జరిగే ఎన్డీఏ సమావేశంలో శాసన సభ పక్ష నేతను ఎన్నుకుంటారు. అనంతరం రేపు (బుధవారం) కొత్త పార్టీ ఎన్నుకున్న అభ్యర్థి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తప్పుకోనున్న నితీశ్బిహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్ తనదైన ముద్ర వేశారు. సీఎంగా దాదాపు 10 సార్లు ప్రమాణ స్వీకారం చేసి ఆ రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సాధించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా వెళ్లనున్నారు. దీంతో జేడీయూ నేతలు ఒకింత భావోద్వేగానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. అయితే గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆరాష్ట్రంలోని 243 సీట్లకు 202 స్థానాలు సాధించి ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ 89 సీట్లు, జేడీయూ 85 స్థానాలు సాధించింది. దీంతో బిహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ ప్రస్తుతం రాజీనామా చేయనున్నారు.ముఖ్యమంత్రి రేసులో?బిహార్ ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బీజేపీ నేత సామ్రాట్ చౌదరి. 1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన సామ్రాట్ చౌదరి.. 2000లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో పర్బత్తా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై రబ్రీ దేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. అనంతరం ప్రభుత్వ విఫ్‌గా 2014లో ఆర్జేడీ పార్టీ తిరుగుబాటు వర్గంలో చేరి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని జనతా దళ్(యూ)లో చేరి 2 జూన్ 2014న పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. చాలా వరకూ సామ్రాట్ చౌదరినే సీఎంగా ఎన్నుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరోవైపు దళిత నేతను సీఎంగా ఎన్నుకునే అవకాశాలు లేకపోలేదు.


