ఇది బిహార్ సీఎం సమ్రాట్ చౌధరి చిత్రపటమా? ఇలా ఉందేంటి? | Bihar CM Samrat Choudharys Portrait Meme Fest Online, Draws Social Media Reactions | Sakshi
Sakshi News home page

ఇది బిహార్ సీఎం సమ్రాట్ చౌధరి చిత్రపటమా? ఇలా ఉందేంటి?

May 28 2026 11:20 PM | Updated on May 29 2026 5:55 PM

Bihar CM Samrat Choudharys portrait meme fest online

పట్నా: బిహార్ సీఎం సమ్రాట్ చౌధరికి పట్నాకు చెందిన బిల్డర్ సంజీవ్ శ్రీవాస్తవ్ బహుమతిగా ఇచ్చిన కార్టూన్ శైలిలోని ఓ చిత్రపటం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు భారీగా మీమ్స్ సృష్టిస్తూ, సెటైర్లు వేస్తున్నారు.

పట్నాకు చెందిన పాల్వి రాజ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ అధినేత సంజీవ్ శ్రీవాస్తవ్ విలాసవంతమైన జీవనశైలితో ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమావేశానికి సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే చిత్రపటంపై విపరీతమైన చర్చ మొదలైన తర్వాత ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రైవేట్‌గా మార్చారు.

సంజీవ్‌ ఆ నలుపు-తెలుపు పెన్సిల్/చార్కోల్ చిత్రంలో సమ్రాట్ చౌధరి ముఖాన్ని అతిశయంగా చూపించారు. పెద్ద కళ్లతో పాటు మందమైన గడ్డం, బాగా హైలైట్ చేసిన నుదురు, పెద్ద కార్టూన్ తరహా చెవులు, పొడవైన కనురెప్పలు చిత్రంలో కనిపించాయి. ఈ చిత్రాన్ని ఎవరు వేశారన్న విషయం స్పష్టంగా తెలియకపోయినా, కుటుంబానికి దగ్గరగా ఉన్నవారే గీసి ఉండొచ్చని సోషల్ మీడియా యూజర్లు అంటున్నారు. చిత్రపటంతో పాటు శ్రీవాస్తవ్ మరికొన్ని బహుమతులను కూడా ముఖ్యమంత్రికి అందించారు.

నెటిజన్ల స్పందనలు
ఆ చిత్రం అసలు సమ్రాట్ చౌధరిలా లేదంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. బాలీవుడ్ సినిమా వెల్‌కమ్‌లో కనిపించిన “మజ్ను భాయ్” పెయింటింగ్‌తో ఈ చిత్రాన్ని పోల్చారు.

ఓ ఎక్స్ యూజర్‌ స్పందిస్తూ.. “ఈ వ్యక్తి బిహార్ సీఎం సమ్రాట్ చౌధరికి ఇచ్చింది పెయింటింగ్ అని అసలు చెప్పలేం. సమ్రాట్ చౌధరి మంచి మనిషి కాబట్టే ఆయనకు ఈ విచిత్ర చిత్రాన్ని ధైర్యంగా అందించి కూడా సురక్షితంగా బయటపడ్డాడు” అని సెటైర్‌ వేశారు. వేరే నేత అయితే ఈ చిత్రం ఇచ్చిన వారిని శిక్షించే వారని అన్నారు.

మరో వ్యక్తి స్పందిస్తూ.. “మజ్ను భాయ్ గర్వపడేవాడు. బిహార్ నిర్మాణ సంస్థ డైరెక్టర్.. సీఎం సమ్రాట్ చౌధరిని కలిసి ఈ కళాఖండాన్ని పూర్తి నమ్మకంతో బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత నాలుగు ఫొటోలను గర్వంగా సోషల్ మీడియాలో పెట్టాడు” అని పేర్కొన్నాడు. “తప్పుడు రూపం చూపించారని కేసు వేస్తారా?” అని ఓ వ్యక్తి ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement