టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌..! వైభవ్‌, భువీకి ఛాన్స్‌? | CSK Legend Picks Bhuvneshwar In India’s Alternate T20I Squad | Sakshi
Sakshi News home page

టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌..! వైభవ్‌, భువీకి ఛాన్స్‌?

May 15 2026 6:14 PM | Updated on May 15 2026 7:19 PM

CSK Legend Picks Bhuvneshwar In India’s Alternate T20I Squad

ఐపీఎల్‌-2026లో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. భువీ 36 ఏళ్ల వయస్సులోనూ తన స్వింగ్ బౌలింగ్‌తో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. భువనేశ్వర్ ప్రస్తుతం 22  వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్ధానంలో ఉన్నాడు. 

అతడి నిలకడైన ప్రదర్శన కారణంగానే ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్‌లో కొనసాగుతోంది. దీంతో అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న భువీని మ‌ళ్లీ భార‌త టీ20 జ‌ట్టులోకి తీసుకోవాల‌ని మాజీలు సూచిస్తున్నారు. ఈ క్ర‌మంలో టీమిండియా మాజీ ఆట‌గాడు, సీఎస్‌కే లెజెండ్ అంబ‌టి రాయుడు తాజాగా త‌న భారత ప్రత్యామ్నాయ టీ20 జ‌ట్టును ఎంచుకున్నాడు. 

ఈ జ‌ట్టు కెప్టెన్‌గా స్టార్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను రాయుడు ఎంపిక చేశాడు. అదేవిధంగా అయ్య‌ర్ డిప్యూటీగా కేఎల్ రాహుల్‌కు అత‌డు ఛాన్స్ ఇచ్చాడు. రాయుడు త‌న జ‌ట్టులో ఫ్రంట్‌లైన్ పేస‌ర్‌గా భువనేశ్వ‌ర్ కుమార్‌కు అవ‌కాశ‌మిచ్చాడు. 

అదేవిధంగా యువ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. వైభవ్‌, రాహుల్‌ను ఓపెనర్లగా రాయుడు ఎంచుకున్నాడు. అదేవిధంగా మిడిలార్డర్‌లో పడిక్కల్‌, పాటిదార్‌ వంటి వారు స్టార్‌ బ్యాటర్లకు చోటు దక్కింది. రిజర్వ్‌ ప్లేయర్‌గా సుదర్శన్‌, ధ్రువ్‌ జురెల్‌ వంటి వారు ఉన్నారు.

కాగా వచ్చే నెలలో భారత జట్టు రెండు టీ20ల కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్‌కు సీనియర్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. దీంతో వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ సూర్యవంశీ వంటి యువ సంచలనాలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.

అంబటి రాయుడు ఎంపిక చేసిన భారత ప్రత్యామ్నాయ టీ20 జట్టు:
వైభవ్ సూర్యవంశీ, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, కృనాల్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, భువనేశ్వర్ కుమార్, అన్షుల్ కాంబోజ్, మొహ్సిన్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్

రిజర్వ్‌లు: సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, శివంగ్ కుమార్, ప్రిన్స్ యాదవ్

Advertisement
 
Advertisement
Advertisement