Punjab Kings vs Mumbai Indians Live updates and Highlights: ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.5 ఓవర్లలో చేధించింది.
తిలక్ వర్మ (33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 నాటౌట్) కీలక పాత్ర పోషించాడు. ఈ ఓటమితో పంజాబ్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్ బౌలర్లలో ఓమర్జాయ్ రెండు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్, చాహల్ తలా వికెట్ సాధించారు.
విజయానికి చేరువలో ముంబై
తిలక్ వర్మ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 25 బంతుల్లోనే తిలక్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ముంబై విజయానికి 12 బంతుల్లో 28 పరుగులు కావాలి.
ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ డట్
ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన రూథర్ ఫర్డ్.. ఓమర్జాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 21 బంతుల్లో 52 పరుగులు కావాలి.
దూకుడుగా ఆడుతున్న తిలక్
15 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ మూడు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ముంబై విజయానికి 30 బంతుల్లో 72 పరుగులు కావాలి. క్రీజులో తిలక్ వర్మ(37), షెర్పేన్ రూథర్ ఫర్డ్(13) ఉన్నారు.
ముంబై ఇండియన్స్ మూడో వికెట్ డౌన్
రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన రోహిత్.. చాహల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
ముంబై ఇండియన్స్ రెండో వికెట్ డౌన్
ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన నమన్ ధీర్.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8.5 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 81/2
ముంబై ఇండియన్స్ తొలి వికెట్ డౌన్
ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 48 పరుగులు చేసిన ర్యాన్ రికెల్టన్.. ఓమర్జాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6.3 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 61/1
దూకుడుగా ఆడుతున్న రికెల్టన్
3 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. క్రీజులో ర్యాన్ రికెల్టన్(24), రోహిత్ శర్మ(4) పరుగులతో ఉన్నారు.
చెలరేగిన పంజాబ్ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్
ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.
పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓమర్జాయ్(17 బంతుల్లో 38), బార్ట్‌లెట్(7 బంతుల్లో 18), ప్రియాన్ష్ ఆర్య(22) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్ రెండు, బాష్, బావా తలా వికెట్ సాధించారు.
దూకుడుగా ఆడిన ఓమర్జాయ్
అజ్మతుల్లా ఓమర్జాయ్ దూకుడుగా ఆడాడు. 16 బంతుల్లో 38 పరుగులు చేసి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరగాడు. అతడి కంటే ముందు జాన్సన్.. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
పంజాబ్ ఆరో వికెట్ డౌన్
పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన శశాంక్ సింగ్.. కార్భిన్ బాష్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
పంజాబ్ ఐదో వికెట్ డౌన్
సూర్యాంశ్ షెడ్గే రూపంలో పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో సూర్యాంశ్ ఔటయ్యాడు.
పంజాబ్ నాలుగో వికెట్ డౌన్
కూపర్ కొన్నోలీ రూపంలో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన కొన్నోలీ రాజ్ బావా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 122-4
పంజాబ్ మూడో వికెట్ డౌన్
పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
పంజాబ్ రెండో వికెట్ డౌన్
పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 57 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్.. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11.2 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 107/3
పంజాబ్ తొలి వికెట్ డౌన్
50 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
దూకుడుగా ఆడుతున్న ప్రియాన్ష్
5 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య(22), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(23) ఉన్నారు.
3 ఓవర్లకు పంజాబ్ స్కోరెంతంటే?
3 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో ప్రభ్‌సిమ్రాన్ సింగ్(9), ప్రియాన్ష్ ఆర్య(12) ఉన్నారు.
ఐపీఎల్-2026 సీజన్‌లో ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
కాగా ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇప్పటికే గాయం కారణంగా దూరంగా కాగా.. ఇప్పుడు పంజాబ్‌తో మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు.
ముంబై జట్టులోకి శార్ధూల్ ఠాకూర్‌తో పాటు రఘు శర్మ తిరిగొచ్చారు. మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా మూడు మార్పులు చేసిది. హర్‌ప్రీత్ బ్రాక్, జేవియర్ బార్ట్‌లెట్, ఓమర్జాయ్ తుది జట్టులోకి వచ్చారు.
తుది జట్లు
ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), నమన్ ధీర్, తిలక్ వర్మ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), రఘు శర్మ
పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), సూర్యాంశ్ షెడ్జ్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్


