సారా టేలర్‌కు అరుదైన అవకాశం  | Sarah Taylor appointed England Mens Test fielding coach | Sakshi
Sakshi News home page

సారా టేలర్‌కు అరుదైన అవకాశం 

May 14 2026 6:17 AM | Updated on May 14 2026 9:17 AM

Sarah Taylor appointed England Mens Test fielding coach

ఇంగ్లండ్‌ పురుషుల జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌గా ఎంపిక  

లండన్‌: ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ దిగ్గజం, మాజీ వికెట్‌ కీపర్‌ సారా టేలర్‌అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్‌ పురుషుల టెస్టు జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌గా ఆమె ఎంపికైంది. న్యూజిలాండ్‌తో త్వరలో జరిగే టెస్టు సిరీస్‌లో ఆమె ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. 

అంతర్జాతీయ స్థాయిలో పురుషుల సీనియర్‌ క్రికెట్‌ జట్టుకు ఒక మహిళా కోచ్‌ పని చేయనుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం. 37 ఏళ్ల సారా టేలర్‌ తన 13 ఏళ్ల కెరీర్‌లో 226 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి అత్యుత్తమ వికెట్‌ కీపర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 

2017లో వన్డే వరల్డ్‌ కప్‌ నెగ్గిన ఇంగ్లండ్‌ టీమ్‌లో ఆమె కీలక పాత్ర పోషించింది. రిటైర్మెంట్‌ అనంతరం కోచింగ్‌ వైపు మళ్లిన సారా...ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో కలిసి ఇంగ్లండ్‌ యువ జట్టుకు పని చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement