ఆ తప్పిదమే మా కొంపముంచింది: శ్రేయస్‌ అయ్యర్‌ | Shreyas Iyer Turns Philosophical After PBKS Playoff Setback, Check Out His Comments After Defeat To RCB | Sakshi
Sakshi News home page

ఆ తప్పిదమే మా కొంపముంచింది: శ్రేయస్‌ అయ్యర్‌

May 17 2026 10:44 PM | Updated on May 18 2026 10:54 AM

Shreyas Iyer turns philosophical after PBKS playoff setback

ఐపీఎల్‌-2026లో పంజాబ్ కింగ్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఆదివారం ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో పంజాబ్‌ పరాజయం పాలైంది. 222 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ 8 వికెట్లు కోల్పోయి నిర్ణీత 199 పరుగులు చేసింది.

శశాంక్‌ సింగ్‌(56), స్టోయినిష్‌(37), సూర్యాంశ్ షెడ్గే(35) కాస్త దూకుడుగా ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయారు. ముఖ్యంగా ప్రియాన్ష్‌ ఆర్య(0), ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌(2), శ్రేయస్‌ అయ్యర్‌(1) దారుణంగా విఫలమయ్యారు. ఈ ఓటమితో తమ పంజాబ్ కింగ్స్‌​ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.

ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ప‌వ‌ర్‌ప్లేలో మూడు వికెట్లు కోల్పోవ‌డం తమ ఓటమిని శాసించిందని అయ్య‌ర్ చెప్పుకొచ్చాడు.

"ఆర్సీబీకి ప‌వ‌ర్‌ప్లేలో అద్భుత‌మైన ఆరంభం ల‌భించింది. ఆపై పవర్‌ప్లే ముగిసిన త‌ర్వాత కూడా మా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. 222 పరుగులు సాధించడం నిజంగా ప్రశంసనీయమైన ప్రదర్శన. మేం బౌలింగ్‌లో ఆశించిన స్థాయిలో వికెట్లు తీయలేకపోయాం. మేము పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను చేజార్చుకున్నాము. 

అనంత‌రం బ్యాటింగ్‌లో కూడా మాకు మంచి ఆరంభం ద‌క్క‌లేదు. మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డాము. ఈ సీజ‌న్‌లో మా జట్టులో ఎక్కువ పరుగులు చేసేది ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్ మాత్ర‌మే.  ప్రతి మ్యాచ్‌లో వారు పవర్‌ప్లేలో దూకుడుగా ఆడి ఒక రిథ‌మ్ సెట్ చేసేవారు. కానీ ఈ మ్యాచ్‌లో వారు ఆరంభ ఇవ్వ‌లేక‌పోయారు. నేను కూడా క్రీజులోకి వ‌చ్చిన వెంట‌నే ఔట‌య్యాను. ఇది న‌న్ను చాలా నిరాశ క‌లిగించింది. 

కానీ మిడిలార్డర్‌లో శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. మేము ఓవర్‌కు దాదాపు 10 పరుగులు సాధిస్తూ ల‌క్ష్యాన్ని చేధించాల‌నుకున్నాము. కానీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాము. భువీ, హాజిల్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మా త‌దుప‌రి గెలిచేందుకు అన్ని విధాల‌గా ప్ర‌య‌త్నిస్తాం. 

ఫలితాలతో సంబంధం లేకుండా నేను ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉంటాను. మ్యాచ్ ఫలితాలు నా వ్యక్తిత్వాన్ని మార్చలేవు.  నేను గతం గురించి మరీ ఎక్కువగా ఆలోచించే వ్యక్తిని కాదు. జరగాల్సింది జరిగిపోయింది. రేపు ఉదయం నేను మళ్ళీ కొత్త సూర్యోదయాన్ని చూస్తాను. చీకటి తర్వాత ఎప్పుడూ వెలుగు ఉంటుందని నేను నమ్ముతాను" పోస్ట్ మ్యాచ్‌ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో శ్రేయస్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement