సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన గుజరాత్‌ | IPL 2026: Sunrisers hyderabad vs Gujarat titans live Updates and highlights | Sakshi
Sakshi News home page

IPL 2026: సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన గుజరాత్‌

May 12 2026 7:17 PM | Updated on May 12 2026 10:57 PM

IPL 2026: Sunrisers hyderabad vs Gujarat titans live Updates and highlights

IPL 2026 SRH vs GT Live Updates: అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి పాలైంది. 168 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక ఆరెంజ్ ఆర్మీ చతికిలబడింది. గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది.  గుజరాత్ బౌలర్లలో రబాడ, జాసన్ హోల్డర్ తలా మూడు వికెట్లతో సత్తాచాటగా.. ప్రసిద్ద్ రెండు, సిరాజ్‌, రషీద్ ఖాన్ ఓ వికెట్ సాధించారు.

ఓటమి దిశగా ఎస్‌ఆర్‌హెచ్‌
ఎస్‌ఆర్‌హెచ్‌ 72 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

పీకల్లోతు కష్టాల్లో సన్‌రైజర్స్‌
ఎస్‌ఆర్‌హెచ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 14 పరుగులు చేసిన క్లాసెన్‌.. జాసన్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10.1 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 56/6

ఎస్‌ఆర్‌హెచ్‌ ఐదో వికెట్‌ డౌన్‌
ఎస్‌ఆర్‌హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన సైల్ ఆరోరా.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఎస్‌ఆర్‌హెచ్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
ఎస్‌ఆర్‌హెచ్‌ 34 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 9 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 54/4. క్రీజులో సైల్‌ ఆరోరా(16), హెన్రిచ్‌ క్లాసెన్‌(13) ఉన్నారు.

ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో వికెట్‌ డౌన్‌
ఇషాన్‌ కిషన్‌ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ఇషాన్‌ కిషన్‌.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 29/3

ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ డౌన్‌
అభిషేక్‌ శర్మ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన అభిషేక్‌.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ డౌన్‌
169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగలింది. డేంజరస్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌.. మొహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

సాయి,వాషీ హాఫ్‌ సెంచరీలు.. ఎస్‌ఆర్‌హెచ్‌ టార్గెట్‌ ఎంతంటే?
టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. గుజరాత్‌ బ్యాటర్లలో సాయిసుదర్శన్‌(61), వాషింగ్టన్‌ సుందర్‌(50) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ప్రపుల్‌ హింగే, షకీబ్‌ తలా రెండు వికెట్లు సాధించారు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌(5)తో పాటు జోస్‌ బట్లర్‌(7) విఫలమయ్యాడు.

14 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 107/3
14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ టైటాన్స్‌ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్‌(55), వాషింగ్టన్‌ సుందర్‌(14) ఉన్నారు.

గుజరాత్‌ రెండో వికెట్‌ డౌన్‌
26 ప‌రుగుల వ‌ద్ద గుజ‌రాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 7 ప‌రుగులు చేసిన జోస్ బ‌ట్ల‌ర్‌.. ప్ర‌పుల్ హింగే బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 6 ఓవర్లకు గుజరాత్‌ టైటాన్స్‌ స్కోర్‌: 34/2

గుజరాత్‌ తొలి వికెట్‌ డౌన్‌
15 పరుగుల వద్ద గుజరాత్‌ టైటాన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన శుభ్‌మన్‌ గిల్‌.. ప్రపుల్‌ హింగే బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఐపీఎల్‌-2026లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జ‌ట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగాయి.

తుది జ‌ట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, నితీష్ కుమార్ రెడ్డి, స్మరణ్ రవిచంద్రన్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే

గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీప‌ర్‌), వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, నిశాంత్ సింధు, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్

Advertisement
 
Advertisement
Advertisement