IPL 2026: పాపం అర్జున్ టెండూల్క‌ర్‌.. జ‌ట్టు మారినా? | Arjun Tendulkar fails to find place in LSG playing XI | Sakshi
Sakshi News home page

IPL 2026: పాపం అర్జున్ టెండూల్క‌ర్‌.. జ‌ట్టు మారినా?

May 15 2026 9:36 PM | Updated on May 15 2026 9:40 PM

Arjun Tendulkar fails to find place in LSG playing XI

ఐపీఎల్‌-2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న సచిన్ టెండూల్క‌ర్ త‌న‌యుడు  అర్జున్ టెండూల్క‌ర్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. లక్నో ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడంతో శుక్రవారం ఏకానా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అర్జున్ అవకాశం​ దక్కుతుందని అంతా భావించారు.

కానీ లక్నో మేనెజెమెంట్ మరోసారి అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది. ఆకాష్ మహారాజ్ సింగ్‌, యయాంక్ యాదవ్ వంటి యువ పేసర్లను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకొచ్చిన లక్నో.. అర్జున్‌ను మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్‌లో ఉన్న అర్జున్.. ఐపీఎల్ 2026 కోసం జరిగిన ట్రేడింగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి వచ్చాడు.

కానీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కలేదు. సీజన్ తుది దశకు చేరుకున్నప్పటికి అర్జున్‌కు అవకాశమివ్వకపోవడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఈ ఏడాది సీజన్‌లో లక్నోకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కనీసం​ ఆఖరి మ్యాచ్‌లలోనైనా అర్జున్‌ను ఆడిస్తారా లేదా వేచి చూడాలి.

2023లో ముంబై ఇండియన్స్‌ తరపున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన అర్జున్‌.. ఇప్పటివరకు కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ముంబై జట్టులో ఉన్నప్పుడు కూడా అర్జున్ ఎక్కువగా బెంచ్‌కే పరిమితమయ్యాడు.
చదవండి: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌..! వైభవ్‌, భువీకి ఛాన్స్‌?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement