టీ20 వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ విడుదల | ICC Announces Women's T20 World Cup 2026 Warm-up Schedule, Check Out Matches Venues And Other Details Inside | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ విడుదల

May 13 2026 9:10 PM | Updated on May 14 2026 11:33 AM

ICC announces Women's T20 World Cup 2026 Warm-up fixtures

మహిళల టీ20 ప్రపంచకప్ 2026 వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ బుధ‌వారం విడుద‌ల చేసింది. ప్ర‌ధాన టోర్నీ ప్రారంభానికి ముందు అన్ని జ‌ట్లు స‌న్న‌ద్దం కావ‌డానికి వీలుగా ఈ వార్మప్ మ్యాచ్‌లు  జూన్ 6 నుండి 10 వరకు జరగనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనే మొత్తం 12 జట్లు తలో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతాయి.

మొత్తం నాలుగు వేదిక‌ల్లో ఈ వార్మాప్ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. తొలి మ్యాచ్ జూన్ 6న డెర్బీ వేదిక‌గా నెద‌ర్లాండ్స్‌, స్కాట్లాండ్ మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. భార‌త్ త‌మ మొద‌టి ప్రాక్టీస్ మ్యాచ్ జూన్ 8న వెస్టిండీస్‌తో, త‌ర్వాత జూన్ 10న ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇక ప్ర‌ధాన టోర్నీ జూన్ 12న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది. భార‌త జ‌ట్టు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ల‌తో పాటు గ్రూపు-ఎలో ఉంది.

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 గ్రూప్స్‌
గ్రూప్ 1: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్
గ్రూప్ 2: వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్
6 జూన్ నెదర్లాండ్స్ vs స్కాట్లాండ్ (డెర్బీ) ఉదయం 10 గంటలకు

6 జూన్ దక్షిణాఫ్రికా vs ఐర్లాండ్ (లౌబరో) ఉదయం 10 గంటలకు

6 జూన్ శ్రీలంక vs పాకిస్తాన్ (డెర్బీ) మధ్యాహ్నం 3 గంటలకు

6 జూన్ న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ (లౌబరో) మధ్యాహ్నం 3 గంటలకు

8 జూన్ వెస్టిండీస్ vs ఇండియా (కార్డిఫ్) ఉదయం 10 గంటలకు

8 జూన్ ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా (కార్డిఫ్) మధ్యాహ్నం 3 గంటలకు
9 జూన్ స్కాట్లాండ్ vs పాకిస్తాన్ (డెర్బీ) ఉదయం 10 గంటలకు

9 జూన్ ఐర్లాండ్ vs బంగ్లాదేశ్ (లౌబరో) ఉదయం 10 గంటలకు

9 జూన్ నెదర్లాండ్స్ vs శ్రీలంక (డెర్బీ) మధ్యాహ్నం 3 గంటలకు

9 జూన్ దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్ (లౌబరో) మధ్యాహ్నం 3 గంటలకు

10 జూన్ ఇండియా vs ఇంగ్లాండ్ (కార్డిఫ్) ఉదయం 10 గంటలకు

10 జూన్ వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా (కార్డిఫ్) మధ్యాహ్నం 3 గంటలకు
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement