మిల్లర్‌, అక్షర్‌ మెరుపులు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం | Axar-Miller Guide Delhi Capitals Victory Over Punjab Kings By 3 Wickets | Sakshi
Sakshi News home page

మిల్లర్‌, అక్షర్‌ మెరుపులు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం

May 11 2026 11:35 PM | Updated on May 11 2026 11:48 PM

Axar-Miller Guide Delhi Capitals Victory Over Punjab Kings By 3 Wickets

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026లో క‌చ్చితంగా గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జూలు విదిల్చింది. సోమ‌వారం ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ 3 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 211 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ (56), డేవిడ్ మిల్ల‌ర్ (51) అర్థ‌సెంచ‌రీల‌తో ఢిల్లీ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించారు. ఆఖ‌ర్లో అశుతోశ్ శ‌ర్మ (24) , మాధ‌వ్ తివారి (18 నాటౌట్‌), అకిబ్ న‌బీ (10 నాటౌట్‌) హిట్టింగ్‌తో ఢిల్లీకి విజ‌యాన్ని అందించారు. పంజాబ్ బౌలర్లలో  అర్ష్‌దీప్, యష్ ఠాకూర్ చెరో 2 వికెట్లు తీశారు. 

అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన‌ పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 210 ప‌రుగులు చేసింది. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (36 బంతుల్లో 59 నాటౌట్‌) అజేయ అర్థ‌సెంచ‌రీ సాధించ‌గా.. ఓపెన‌ర్ ప్రియాన్ష్ ఆర్య (33 బంతుల్లో 56) మెరుపు ఇన్నింగ్స్‌తో అల‌రించాడు. కూప‌ర్ క‌నోలి (38) కీల‌క ఇన్నింగ్స్ ఆడ‌గా.. చివ‌ర్లో సూర్యాంశ్ షెగ్డె (8 బంతుల్లో 22 నాటౌట్‌) ఆక‌ట్టుకున్నాడు. 

ఢిల్లీ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్, మాధ‌వ్ తివారి చెరో 2 వికెట్లు తీయ‌గా, ముకేశ్ కుమార్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ సీజన్‌లో ఇది ఐదో విజయం కాగా, పంజాబ్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement