సామ్సన్‌ భారత  కెప్టెన్‌ అవుతాడు! | Sanju Samson a future Indian T20I captain says Ravi Shastri | Sakshi
Sakshi News home page

సామ్సన్‌ భారత  కెప్టెన్‌ అవుతాడు!

May 16 2026 6:21 AM | Updated on May 16 2026 6:21 AM

Sanju Samson a future Indian T20I captain says Ravi Shastri

రవిశాస్త్రి విశ్వాసం 

దుబాయ్‌: వచ్చే రెండు, మూడేళ్లలో సంజూ సామ్సన్‌ భారత టి20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఖాయమని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత రవిశాస్త్రి అన్నాడు. 2026 టి20 వరల్డ్‌ కప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సామ్సన్‌కు కెప్టెన్‌ అయ్యే స్థాయి, అర్హత ఉన్నాయని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. ‘2028 టి20 వరల్డ్‌ కప్‌ సమయానికి సూర్యకుమార్‌ గురించి ఆలోచించే అవకాశం ఉండకపోవచ్చు. వచ్చే రెండేళ్లలో సూర్య ఎలా ఆడినా సరే... జట్టుకు మాత్రం కచ్చితంగా కొత్త కెప్టెన్‌ అవసరమే. సామ్సన్‌ అందుకు సరైనవాడు. ప్రాధాన్యతాక్రమంలో కూడా అతను అందరికంటే ముందున్నాడనేది నా అభిప్రాయం.

 ఐపీఎల్‌లో అతను రాజస్తాన్‌ రాయల్స్‌కు సుదీర్ఘ కాలం సారథిగా వ్యవహరించాడు. టాపార్డర్‌లో విధ్వంసక బ్యాటర్‌గా జట్టులో అతని స్థానం తిరుగులేనిది. కాబట్టి ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు సామ్సన్‌పై పెద్ద బాధ్యత ఉంది. టి20 వరల్డ్‌ కప్‌లో చెలరేగిన తర్వాత ఇప్పుడు ఐపీఎల్‌లో అతను మరింత పరిణతి చెందినట్లుగా కనిపిస్తోంది. తనపై వచ్చిన అన్ని సందేహాలను సామ్సన్‌ జవాబిచ్చేశాడు. భవిష్యత్తులో అతడిని నాయకుడిగా గుర్తించేందుకు ఇది సరిపోతుంది’ అని రవిశాస్త్రి విశ్లేషించాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement