ఇవాళ తేలిపోనున్న మరో జట్టు భవిష్యత్తు | IPL 2026: Delhi capitals fate to be decided today in a clash vs PBKS | Sakshi
Sakshi News home page

ఇవాళ తేలిపోనున్న మరో జట్టు భవిష్యత్తు

May 11 2026 11:49 AM | Updated on May 11 2026 12:35 PM

IPL 2026: Delhi capitals fate to be decided today in a clash vs PBKS

ఐపీఎల్‌ 2026 ప్లే ఆఫ్స్‌ రేసు రసవత్తరంగా సాగుతుంది. నిన్నటితో (మే 10) రెండు జట్లు (లక్నో, ముంబై ఇండియన్స్‌) పోటీ నుంచియ అధికారికంగా నిష్క్రమించాయి. ఇక మిగిలింది ఎనిమిది జట్లు. వీటిలో నాలుగు జట్లకు మాత్రమే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కుతుంది.

ఆ జట్లు ఏవో తేలాలంటే మరికొద్ది రోజుల ఆగాల్సిందే. అయితే ఒక్క జట్టు భవితవ్యం మాత్రమే ఇవాల్టితో తేలిపోయే అవకాశం ఉంది. ఆ జట్టే ఢిల్లీ క్యాపిటల్స్‌. ఢిల్లీ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉండి, నిష్క్రమణ అంచుల్లో నిలిచింది. ఇప్పటివరకు ఆ జట్టు 11 మ్యాచ్‌ల్లో కేవలం​ నాలుగే విజయాలు సాధించి 8 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది.

ఇవాళ పంజాబ్‌ కింగ్స్‌తో జరుగబోయే మ్యాచ్‌ డీసీకి డూ ఆర్‌ డైగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే, ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ రేసులో ఉంటుంది. ఒకవేళ ఓడిందా.. ఈ మ్యాచ్‌తోనే ఇంటిముఖం​ పడుతుంది. ఒకవేళ గెలిచినా ఢిల్లీకి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కడం అంత ఈజీ కాదు. ఏదైనా మహాద్భుతం జరిగితే తప్ప ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరలేదు.

ఫైనల్‌-4కు చేరాలంటే ఆ జట్టు ఏడు జట్లను దాటుకొని వెళ్లాలి. ఇది అంత ఈజీగా జరిగే పని కాదు. కాబట్టి అనధికారికంగా డీసీ ప్లే ఆఫ్స్‌ ఆశలు ఆవిరైనట్టే. ఈ మ్యాచ్‌ ఢిల్లీకి అంత ప్రాధాన్యం కానప్పటికీ.. పంజాబ్‌కు మాత్రం కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ రేసులో మళ్లీ ముందుకెళ్తుంది. ప్రస్తుతం ఆ జట్టు 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీపై గెలిచి రెండు పాయింట్లు సాధిస్తే.. 15 పాయింట్లతో మళ్లీ టేబుల్‌ టాపర్‌గా నిలుస్తుంది.

ఓవరాల్‌గా చూస్తే.. ప్రస్తుతం ప్లే ఆఫ్స్‌ పోటీ ప్రధానంగా టాప్‌-4లో ఉన్న నాలుగు జట్ల మధ్యే ఉంది. ఏదైనా అనూహ్యం జరిగితే సీఎస్‌కే, రాజస్థాన్‌ కూడా లైన్‌లోకి వస్తాయి. అద్భుతం జరిగితే కేకేఆర్‌, డీసీ కూడా రేసులో ఉంటాయి.

ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్న జట్లు ఆడాల్సిన మిగిలిన మ్యాచ్‌లు..
ఆర్సీబీ- కేకేఆర్‌ (మే 13), పంజాబ్‌ (17), ఎస​్‌ఆర్‌హెచ్‌ (22)
ఎస్‌ఆర్‌హెచ్‌- గుజరాత్‌ (12), సీఎస్‌కే (18), ఆర్సీబీ (22)
గుజరాత్‌- ఎస్‌ఆర్‌హెచ్‌ (12), కేకేఆర్‌ (16), సీఎస్‌కే (21)
పంజాబ్‌- డీసీ (11), ముంబై (14), ఆర్సీబీ (17), లక్నో (23)
సీఎస్‌కే- లక్నో (15), ఎస్‌ఆర్‌హెచ్‌ (18), గుజరాత్‌ (21)
రాజస్థాన్‌- డీసీ (17), లక్నో (19), ముంబై (24)
కేకేఆర్‌- ఆర్సీబీ (13), గుజరాత్‌ (16), ముంబై (20), డీసీ (24)
డీసీ- పంజాబ్‌ (11), రాజస్థాన్‌ (17), కేకేఆర్‌ (24)

 

Advertisement
 
Advertisement
Advertisement