రాజస్తాన్‌ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం | IPL 2026: Delhi capitals vs Rajasthan royals live updates and Highlights | Sakshi
Sakshi News home page

IPL 2026: రాజస్తాన్‌ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం

May 17 2026 7:03 PM | Updated on May 17 2026 11:36 PM

IPL 2026: Delhi capitals vs Rajasthan royals live updates and Highlights

Delhi capitals vs Rajasthan royals live updates and Highlights: అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్తాన్ విధించిన 194 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది.  అక్షర్ పటేల్‌(34), అశుతోష్‌ శర్మ(18) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఈ విజయంతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

ఢిల్లీ ఐదో వికెట్‌ డౌన్‌
ఢిల్లీ ఐదో వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన డేవిడ్‌ మిల్లర్‌ బ్రిజేష్‌ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఢిల్లీ నాలుగో వికెట్‌ డౌన్‌
ట్రిస్టన్‌ స్టబ్స్‌ రూపంలో ఢిల్లీ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 4 పరుగులు చేసిన స్టబ్స్‌.. ఆర్చర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 22 బంతుల్లో 41 పరుగులు కావాలి. క్రీజులో అక్షర్‌ పటేల్‌(23) ఉన్నాడు.

కేఎల్‌ రాహుల్‌ అవుట్‌
133 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్‌ కోల్పోయింది. 56 పరుగులు చేసిన రాహుల్‌.. దసున్‌ షనక బౌలింగ్‌లో ఔటయ్యాడు. అంతకముందు అర్చర్‌ బౌలింగ్‌లో సాహిల్‌ ఫరాఖ్‌ ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 32 బంతుల్లో 60 పరుగులు కావాలి.

తొలి వికెట్‌ డౌన్‌
ఢిల్లీ తొలి వికెట్‌ కోల్పోయింది. 51 పరుగులు చేసిన అభిషేక్‌ పోరెల్‌.. బ్రిజేష్‌ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

పోరెల్‌ హాఫ్‌ సెంచరీ
10 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 105 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్‌ పోరెల్‌(51), కేఎల్‌ రాహుల్‌(46) ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న పోరెల్‌
4 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్‌ పోరెల్‌(27), కేఎల్‌ రాహుల్‌(16) ఉన్నారు.

రాణించిన పరాగ్‌, జురెల్‌.. ఢిల్లీ టార్గెట్‌ ఎంతంటే?
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓ దశలో 200కు పైగా పరుగులు సాధించేలా కన్పించిన రాజస్తాన్.. ఆఖరిలో మాత్రం తడబడింది. 

రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో ధ్రువ్‌ జురెల్‌(53), రియాన్‌ పరాగ్‌(51) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటగా.. వైభవ్‌ సూర్యవంశీ(21 బంతుల్లో 46) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ నాలుగు వికెట్లు, ఎంగిడీ, మాధవ్‌ తివారీ తలా రెండు వికెట్లు సాధించారు.

మిచెల్‌ మ్యాజిక్‌
మిచెల్‌ స్టార్క్‌ దెబ్బకు రాజస్తాన్‌ రాయల్స్‌ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోయింది. 15వ ఓవర్‌ వేసిన స్టార్క్‌ బౌలింగ్‌లో రెండో బంతికి పరాగ్‌ ఔట్‌ కాగా.. మూడో బంతికి ఫెరీరా ఔటయ్యాడు.  ఆ తర్వాత ఐదో బంతికి రవి సింగ్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. 15 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 166/5

పరాగ్‌ హాఫ్‌ సెంచరీ
రియాన్‌ పరాగ్‌ దూకుడుగా ఆడుతున్నాడు. పరాగ్‌ కేవలం 23 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

రాజస్తాన్‌ రెండో వికెట్‌ డౌన్‌
వైభవ్‌ సూర్యవంశీ రూపంలో రాజస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 46 పరుగులు చేసిన వైభవ్‌.. మాధవ్‌ తివారీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 98/2

వైభవ్‌ మెరుపులు
వైభ‌వ్ సూర్య‌వంశీ మెరుపులు మెరిపిస్తున్నాడు. కేవ‌లం 16 బంతుల్లోనే 42 ప‌రుగుల‌తో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. 6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ వికెట్ న‌ష్టానికి 75 ప‌రుగులు చేసింది.

రాజస్తాన్‌ తొలి వికెట్‌ డౌన్‌
జైశ్వాల్ రూపంలో రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన జైశ్వాల్‌.. లుంగి ఎంగిడీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

ఐపీఎల్‌-2026లో భాగంగా కీల‌క మ్యాచ్‌లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్‌లో ఆంధ్ర క్రికెటర్‌ త్రిపురాన విజయ్ ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున అరంగేట్రం చేశాడు. అకిబ్‌ నబీ స్దానంలో విజయ్‌ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఈ మ్యాచ్‌కు రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇచ్చారు. అతడి స్ధానంలో రవి సింగ్‌ జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్‌ రాహుల్(వికెట్ కీపర్‌), అభిషేక్ పోరెల్, సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్‌), మాధవ్ తివారీ, త్రిపురాన విజయ్, లుంగీ ఎన్గిడి, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్

రాజస్థాన్ రాయల్స్‌: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్‌), రియాన్ పరాగ్(కెప్టెన్‌), రవి సింగ్, డోనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, ఆడమ్ మిల్నే, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement