పాక్‌ బౌలర్‌ ప్ర‌పంచ రికార్డు! | Noman Ali Creates World Record, Becomes Oldest Player Achieve 100 Test Wickets Rare Feet, Read Story Inside | Sakshi
Sakshi News home page

పాక్‌ బౌలర్‌ ప్ర‌పంచ రికార్డు!

May 12 2026 3:18 PM | Updated on May 12 2026 3:45 PM

Noman Ali World-Record Becomes-Oldest Player Achieve-100 Test-Wickets

బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ ఆట‌గాళ్లు రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నారు. ఇప్ప‌టికే టెస్టుల్లో 400 వికెట్ల మార్క్‌తో షాహిన్ అఫ్రిది కొత్త రికార్డు నెల‌కొల్ప‌గా.. తాజాగా పాకిస్తాన్ స్పిన్న‌ర్ నోమ‌న్ అలీ టెస్టులో వంద వికెట్ల మార్క్‌ను సాధించాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 69.1 ఓవ‌ర్‌లో మెహ‌దీ హ‌స‌న్ మిరాజ్‌ను పెవిలియ‌న్ చేర్చ‌డం ద్వారా నోమ‌న్ అలీ ఈ ఫీట్ సాధించాడు. 

త‌ద్వారా టెస్టు క్రికెట్‌లో వంద వికెట్ల మార్క్ సాధించిన పెద్ద వయ‌స్కుడిగా నోమ‌న్ అలీ నిలిచాడు. 22 టెస్టుల్లో వంద వికెట్ల మార్క్ అందుకున్న నోమ‌న్ అలీ ప్ర‌స్తుత వ‌య‌స్సు 39 ఏళ్ల 213 రోజులు. నోమ‌న్ అలీ కంటే ముందు ఈ రికార్డు బాబీ పీల్ (39 ఏళ్ల 180 రోజులు) పేరిట ఉండేది. రే విల్లింగ్‌ట‌న్ (39 ఏళ్ల 30 రోజులు), క్లారీ గ్రిమ్మెట్ (39 ఏళ్ల 22 రోజులు), సిడ్నీ బార్న్స్ (38 ఏళ్ల 310 రోజులు) కూడా పెద్ద వ‌య‌సులోనే వంద వికెట్ల మార్క్ సాధించారు. 

అంతేకాదు పాక్ త‌ర‌ఫున త‌క్కువ టెస్టుల్లో వంద వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో చోటు ద‌క్కించుకున్న నోమ‌న్ అలీ ఆ జ‌ట్టు మాజీ ఆల్‌రౌండ‌ర్ అబ్దుల్ ర‌జాక్ రికార్డును స‌వ‌రించాడు. 2021లో పాకిస్తాన్ త‌ర‌ఫున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన నోమ‌న్ అలీ 100 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన త‌ర్వాత కానీ అత‌డికి తొలి మ్యాచ్‌ ఆడే అవ‌కాశం ల‌భించ‌లేదు. 

2024లో సొంత‌గ‌డ్డ‌పై ఇంగ్లండ్‌తో జ‌రిగిన‌ టెస్టు సిరీస్‌ను 1-0తో పాకిస్తాన్ గెల‌వ‌డంలో నోమ‌న్ అలీ పాత్ర కీల‌కం. 22 మ్యాచ్‌ల్లో 101 వికెట్లు సాధించిన నోమ‌న్ అలీ 9 సార్లు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేశాడు. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి ప‌ది వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. మ్యాచ్ విష‌యానికొస్తే చివ‌రి రోజు ఆట‌లో పాకిస్తాన్ విజ‌యం కోసం క‌ష్ట‌ప‌డుతోంది. 

బంగ్లా విధించిన 268 ప‌రుగుల టార్గెట్‌ను ఛేదించే క్ర‌మంలో త‌డ‌బడుతున్న పాకిస్తాన్ ప్ర‌స్తుతం 38 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 139 ప‌రుగుల‌తో ఆడుతోంది. సాద్ ష‌కీల్ (10), రిజ్వాన్ (7) క్రీజులో ఉన్నారు. పాక్ విజ‌యానికి మ‌రో 128 ప‌రుగులు అవస‌రం.

చదవండి: ‘అతి తెలివి కొంపముంచింది.. అందుకే ఓడిపోయాం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement