‘అతి తెలివి కొంపముంచింది.. అందుకే ఓడిపోయాం’ | Shreyas Says-Have been short-of-planning Lost Match Vs Delhi Capitals | Sakshi
Sakshi News home page

Shreyas Iyer: ‘అతి తెలివి కొంపముంచింది.. అందుకే ఓడిపోయాం’

May 12 2026 1:35 PM | Updated on May 12 2026 1:46 PM

Shreyas Says-Have been short-of-planning Lost Match Vs Delhi Capitals

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ వ‌రుస‌గా నాలుగో ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో ఓట‌మిపాల‌య్యింది. 200 ప‌రుగుల‌కు పైగా టార్గెట్ నిర్దేశించి కూడా పంజాబ్ ఓడిపోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా స్పిన్న‌ర్లకు అనుకూలించే ధ‌ర్మ‌శాల పిచ్‌పై పంజాబ్ కెప్టెన్ అయ్య‌ర్ ఒక్క ఓవ‌ర్ కూడా స్పిన్న‌ర్ల‌తో వేయించ‌క‌పోవ‌డం ఆ జ‌ట్టును దెబ్బ‌తీసింద‌ని చెప్పొచ్చు. 

మ‌రోవైపు ఢిల్లీ కూడా ఒక్క స్పిన్న‌ర్‌తోనై బౌలింగ్ చేయించ‌క‌పోవ‌డం గ‌మనార్హం. ఇక మ్యాచ్ ఓట‌మి అనంత‌రం శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. ‘ధ‌ర్మ‌శాల వంటి ఫ్లాట్ పిచ్‌పై 210 ప‌రుగుల ల‌క్ష్యం చాలా ఎక్కువ‌. కానీ సీమ‌ర్ల‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మ‌రో 20 నుంచి 30 ప‌రుగులు చేసి ఉంటే బాగుండేదేమో. చాహ‌ల్‌తో ఒక్క ఓవ‌ర్ కూడా వేయించ‌క‌పోవ‌డం వెనుక ఒకటే కార‌ణం. 

బంతి సీమ‌ర్ల‌కు బాగా అనుకూలిస్తుంద‌ని భావించాను. కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చినప్పుడు హార్డ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం ఉత్తమం. అక్కడ నిలకడగా బౌలింగ్ చేస్తే కనీసం ఒక్క బంతయినా మిస్-హిట్ అయ్యి వికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మా సీమ‌ర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విస‌రడంలో విఫ‌ల‌మ‌య్యారు. 

మా బౌల‌ర్లు భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకోవడంతో పాటు ఫీల్డింగ్‌లో లోపాలు మా కొంపముంచాయి. మా ప్రణాళికల‌న్నీ ఆచరణలో దారుణంగా విఫలమయ్యాయి.’ అని  అయ్య‌ర్ చెప్పుకొచ్చాడు. ఈ ఓటమితో పంజాబ్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయంతో ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

చదవండి: ‘ఐసీసీ మాట వినలేదు.. మాకు ఇది జరగాల్సిందే’

Advertisement
 
Advertisement
Advertisement