న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గత కొంత కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న స్టార్ ఓపెనర్ జాక్ క్రాలీపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సెలక్షన్ కమిటీ వేటు వేసింది. అతడి స్ధానంలో యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఎమిలియో గేను రంగంలోకి దించాలని సెలక్టర్లు నిర్ణయించారు. జూన్ 4 నుంచి లార్డ్స్ వేదికగా కివీస్‌తో జరగనున్న తొలి టెస్టులో గే ఇంగ్లండ్ తరపున అరంగేట్రం చేయనున్నాడు.
ఇటలీ నుంచి ఇంగ్లండ్‌కు
అయితే 26 ఏళ్ల ఎమిలియో గే ఇప్పటికే ఇటలీ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. గే ఇంగ్లండ్‌లోని బెడ్‌ఫోర్డ్‌లో జన్మించినప్పటికీ.. అతడి తల్లి ఇటలీ దేశస్థురాలు కావడంతో ఆ దేశం తరఫున ఆడే అవకాశం లభించింది. 2025లో ఇటలీ తరపున మూడు టీ20 మ్యాచ్‌లు అతడు ఆడాడు. 2026 టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్స్‌లో స్కాట్లాండ్‌పై అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించి గే అందరి దృష్టిని ఆకర్షించాడు.
పొట్టి ప్రపంచకప్‌నకు ఇటలీ అర్హత సాధించడంలో అతడిది కీలక పాత్ర. అయితే ఆ తర్వాత ఇంగ్లండ్‌కు తన మకాంను మార్చిన గే.. ప్రస్తుతం కౌంటీ క్రికెట్‌లో డర్హామ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2026 కౌంటీ సీజన్‌లో అతడు కేవలం మ్యాచ్‌ల్లోనే 92 సగటుతో 554 పరుగులు సాధించాడు.
ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. దీంతో అతడికి ఇంగ్లండ్ టెస్టు జట్టులో తొలిసారి అతడికి చోటు దక్కింది. అంతకుముందు ఇయాన్ మోర్గాన్ కూడా ఐర్లాండ్ నుంచి వచ్చి ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అతడి సారథ్యంలోనే ఇంగ్లండ్ 2019 ప్రపంచకప్‌ను గెలుచుకుంది.


