నీకసలు సెన్స్‌ ఉందా రుతురాజ్‌?.. అతడిని ఆడించవా? | Ruturaj Gaikwad Criticised Over Tactical Decisions After Chennai Super Kings Loss To Lucknow Super Giants, Read Story Inside | Sakshi
Sakshi News home page

నీకసలు సెన్స్‌ ఉందా రుతురాజ్‌?.. అతడిని ఆడించవా?

May 16 2026 9:00 AM | Updated on May 16 2026 10:17 AM

Zero Sense: Ruturaj Gaikwad Lambasted For Big Tactical Blunder

ఐపీఎల్‌-2026లో ఐదు రోజుల క్రితం ఆదివారం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లు ఐపీఎల్‌లో ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలు కోల్పోయాయి. ఆ తర్వాత తాము ఆడిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ను ముంబై చిత్తు చేయగా.. తాజాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు లక్నో ఝలక్‌ ఇచ్చింది. 

గత మ్యాచ్‌లో చెన్నై చేతిలోనే ఓడి చాన్స్‌ కోల్పోయిన లక్నో... ఇప్పుడు తమ సొంతగడ్డపై ప్రత్యర్థిని చిత్తు చేసి లెక్క సరిచేసింది. బౌలింగ్‌లో ఆకాశ్, బ్యాటింగ్‌లో మిచెల్‌ మార్ష్‌ మెరుపులు లక్నోను గెలిపించగా... మూడు వరుస విజయాల తర్వాత మరింత పైకి చేరే స్థితిలో నిలిచిన చెన్నై ఈ ఓటమితో తమ పరిస్థితిని సంక్లిష్టంగా మార్చుకుంది.

కార్తిక్‌ శర్మ ఒక్కడే
ఏకనా స్టేడియంలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులే చేయగలిగింది. కార్తిక్‌ శర్మ 71 పరుగులతో రాణించగా.. మిగతా వారి నుంచి అతడికి పెద్దగా సహకారం లభించలేదు.

మిచెల్‌ మార్ష్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌
ఇక నామమాత్రపు లక్ష్యాన్ని లక్నో 16.4 ఓవర్లలోనే ఊదేసింది. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ (38 బంతుల్లో 90)తో చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడు వేసిన పునాదిపై నికోలస్‌ పూరన్‌ (17 బంతుల్లో 32 నాటౌట్‌) బలంగా నిలబడి.. లక్నోను విజయతీరాలకు చేర్చాడు.

అన్షుల్‌ కాంబోజ్‌ చెత్త ప్రదర్శన
చెన్నై బౌలర్లలో అన్షుల్‌ కాంబోజ్‌ కేవలం 2.4 ఓవర్లలోనే ఏకంగా 63 పరుగులు ఇచ్చుకుని.. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అతడి ఓవర్లు చెన్నై కొంపముంచాయి. మిగతా వారిలో ముకేశ్‌ చౌదరి, స్పెన్సర్‌ జాన్సన్‌ ఒక్కో వికెట్‌ తీయగా.. నూర్‌ అహ్మద్‌ కాస్త పొదుపుగా బౌలింగ్‌ చేయగా.. గుర్జప్నీత్‌ సింగ్‌ ఫర్వాలేదనిపించాడు.

లక్నో చేతిలో ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం కావడంతో జట్టు ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా లక్నోతో మ్యాచ్‌లో కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అనుసరించిన వ్యూహాలను మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు.

నీకసలు సెన్స్‌ ఉందా రుతురాజ్‌?
ఈ క్రమంలో చెన్నై మాజీ బ్యాటర్‌ సుబ్రమణ్యం బద్రీనాథ్‌ రుతురాజ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘తుదిజట్టు ఎంపికలో తప్పుల కారణంగా ఈ సీజన్‌లో ఓడిపోవడం చెన్నైకి అలవాటుగా మారింది. ఇలాంటి వికెట్‌పై అకీల్‌ హొసేన్‌ను ఆడించకపోవడం అతిపెద్ద తప్పు.

అస్సలు వీళ్లకు సెన్స్‌ ఉందా అనే సందేహం వస్తోంది. మరో మ్యాచ్‌.. చేజారిన మరో అవకాశం’’ అని బద్రీనాథ్‌ ఎక్స్‌ వేదికగా రుతురాజ్‌ను విమర్శించాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గానూ రుతు విఫలమయ్యాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం 13 పరుగులే చేసి నిష్క్రమించాడు.

చదవండి: IPL 2026: సీఎస్‌కేకు చుక్కలు చూపించాడు.. ఎవరీ ఆకాశ్‌ సింగ్‌?

Advertisement
 
Advertisement
Advertisement