భారత ‘ఎ’ జట్టులో వైభవ్‌ సూర్యవంశీ | Vaibhav Suryavanshi Selected In The India A Squad For The Upcoming 50 Over Tri-Series In Sri Lanka, More Details Inside | Sakshi
Sakshi News home page

భారత ‘ఎ’ జట్టులో వైభవ్‌ సూర్యవంశీ

May 15 2026 6:20 AM | Updated on May 15 2026 12:44 PM

Vaibhav Suryavanshi selected in the India A squad for the upcoming 50 over Tri-Series

కెప్టెన్‌గా తిలక్‌ వర్మ

న్యూఢిల్లీ: టీనేజ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ తొలిసారి భారత సీనియర్‌ ‘ఎ’ జట్టులోకి ఎంపికయ్యాడు. బిహార్‌కు చెందిన 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్‌ 19వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున 11 మ్యాచ్‌లు ఆడి 440 పరుగులు చేశాడు. 

జూన్‌  9 నుంచి 21 వరకు శ్రీలంకలోని దంబుల్లాలో జరిగే ముక్కోణపు వన్డే సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును గురువారం ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన భారత ‘ఎ’ జట్టుకు హైదరాబాద్‌ ప్లేయర్‌ తిలక్‌ వర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. 

ఈ సిరీస్‌లో భారత్‌తోపాటు అఫ్గానిస్తాన్, శ్రీలంక ‘ఎ’ జట్లు పాల్గొంటాయి. శ్రీలంక ‘ఎ’ జట్టుతో జూన్‌ 9న, 15న... అఫ్గానిస్తాన్‌ ‘ఎ’తో జూన్‌ 11న, 17న భారత్‌ ‘ఎ’ జట్టు ఆడుతుంది. జూన్‌ 21న ఫైనల్‌ జరుగుతుంది. 

భారత ‘ఎ’ జట్టు: తిలక్‌ వర్మ (కెప్టెన్‌), రియాన్‌ పరాగ్‌ (వైస్‌ కెప్టెన్‌), ప్రియాన్ష్‌ ఆర్య, వైభవ్‌ సూర్యవంశీ, ఆయుశ్‌ బదోని, నిశాంత్‌ సింధు, హర్ష్‌ దూబే, సుయాంశ్‌ షెడ్గే, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, కుమార్‌ కుశాగ్ర, విప్రాజ్‌ నిగమ్, యశ్‌ ఠాకూర్, యు«ద్‌వీర్‌ సింగ్, అన్షుల్‌ కంబోజ్, అర్షద్‌ ఖాన్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement