IPL 2026: సీఎస్‌కేపై లక్నో ఘన విజయం | Lucknow Super Giants vs Chennai Super Kings Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IPL 2026: సీఎస్‌కేపై లక్నో ఘన విజయం

May 15 2026 7:07 PM | Updated on May 15 2026 11:15 PM

Lucknow Super Giants vs Chennai Super Kings Live Updates And Highlights

IPL 2026 LSG vs CSK Live Updates: ఏకానా స్టేడియం వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఘన విజయం సాధించింది. చెన్నై విధించిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని సూపర్ జెయింట్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో చేధించింది. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్ కేవలం 38 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 పరుగులు చేయగా.. ఇంగ్లిష్‌(36), పూరన్‌(32) రాణించారు.

15 ఓవర్లకు లక్నో స్కోర్‌: 156/3
15 ఓవర్లు ముగిసే సరికి లక్నో 3 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్రీజులో ముకుల్‌ చౌదరి(6), నికోలస్‌ పూరన్‌(8) ఉన్నారు.

లక్నో రెండో వికెట్ డౌన్‌
మిచెల్ మార్ష్ రూపంలో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 38 బంతుల్లో 90 పరుగులు చేసిన మార్ష్‌.. దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు.

లక్నో తొలి వికెట్‌ డౌన్‌
లక్నో తొలి వికెట్‌ కోల్పోయింది. 36 పరుగులు చేసిన ఇంగ్లిష్‌.. ముఖేష్‌ చౌదరి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

విజయం దిశగా లక్నో
లక్నో ఓపెనర్లు(85), జోష్‌ ఇంగ్లిష్‌(36) దూకుడుగా ఆడుతున్నారు. 11 ఓవర్లకు లక్నో స్కోర్‌: 129-0

దుమ్ములేపుతున్న మిచెల్‌ మార్ష్‌
5 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్‌ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. 5వ ఓవర్‌ వేసిన అన్షుల్‌ కాంబోజ్‌ బౌలింగ్‌లో మిచెల్‌ మార్ష్‌.. నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 28 పరుగులు పిండుకున్నాడు.

దూకుడుగా ఆడుతున్న ల‌క్నో ఓపెనర్లు
3 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే వికెట్ న‌ష్ట‌పోకుండా 31 ప‌రుగులు చేసింది. క్రీజులో మిచెల్ మార్ష్‌(13), జోష్ ఇంగ్లిష్‌(9) ఉన్నారు.

రాణించిన కార్తీక్‌, దూబే.. లక్నో టార్గెట్‌ ఎంతంటే?
ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్లు రాణించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 

యువ ఆటగాడు కార్తీక్‌ శర్మ 71 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. శివమ్‌ దూబే)32), బ్రెవిస్‌(25) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో ఆకాష్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. షాబాజ్‌, మహ్మద్‌ షమీ తలా వికెట్‌ సాధించారు.

సీఎస్‌కే ఐదో వికెట్‌ డౌన్‌
71 పరుగులు చేసిన కార్తీక్‌ శర్మ.. షాబాజ్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

సీఎస్‌కే నాలుగో వికెట్‌ డౌన్‌
డెవాల్డ్‌ బ్రెవిస్‌ రూపంలో సీఎస్‌కే నాలుగో వికెట్‌ కోల్పోయింది. 25 పరుగులు చేసిన బ్రెవిస్‌.. మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

కార్తీక్‌ శర్మ హాఫ్‌​ సెంచరీ
కార్తీక్‌ శర్మ 35 బంతుల్లో తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

👉11 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 86/3. క్రీజులో కార్తీక్‌ శర్మ(24), బ్రెవిస్‌(18) ఉన్నారు.

సీఎస్‌కే మూడో వికెట్‌ డౌన్‌
సీఎస్‌కే మూడో వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన ఉర్విల్‌ పటేల్‌.. ఆకాష్‌ మహారాజ్‌ సింగ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

సీఎస్‌కే రెండో వికెట్‌ డౌన్‌
సీఎస్‌కే రెండో వికెట్‌ కోల్పోయింది. 20 పరుగులు చేసిన సంజూ శాంసన్‌.. ఆకాష్ మహారాజ్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 37/2

సీఎస్‌కే తొలి వికెట్‌ డౌన్‌
31 పరుగుల వద్ద సీఎస్‌కే తొలి వికెట్‌ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రుతురాజ్‌ గైక్వాడ్‌.. ఆకాష్‌ సింగ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

2 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 20/0
2 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే వికెట్‌ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో సంజూ శాంసన్‌(13), రుతురాజ్‌ గైక్వాడ్‌(6) ఉన్నారు.

ఐపీఎల్‌-2026లో ఏకానా స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సూప‌ర్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ పేసర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌ సీఎస్‌కే తరపున అరంగేట్రం చేశాడు. అదేవిధంగా లక్నో జట్టులోకి అబ్దుల్‌ సమద్‌, ముకుల్‌ చౌదరి వచ్చారు.

తుది జట్లు
చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, ముఖేష్ చౌదరి

లక్నో సూపర్ జెయింట్స్ : మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(కెప్టెన్‌), ముకుల్ చౌదరి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మహ్మద్ షమీ, మయాంక్ యాదవ్, ఆకాష్ మహరాజ్ సింగ్, ప్రిన్స్ యాదవ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement