టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్!? | Bhuvneshwar Kumar Gives Calm Response To Team India Comeback Speculation Amid IPL 2026 Heroics | Sakshi
Sakshi News home page

టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్!?

May 13 2026 9:56 PM | Updated on May 14 2026 11:37 AM

Bhuvneshwar Kumar gives calm response to India return speculation

ఐపీఎల్‌-2026లో టీమిండియా వెటరన్,  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. భువీ 36 ఏళ్ల వయస్సులోనూ తన అద్భుత బౌలింగ్‌తో బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ తనలో ఏమాత్రం పదను తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు.

స‌రైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేస్తూ క్ర‌మం త‌ప్పుకుండా వికెట్లు ప‌డ‌గొడుతున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ 21 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ రేసులో భువీ అగ్ర‌స్ధానంలో ఉన్నాడు. అయితే లేటు వ‌య‌స్సులో ఇర‌గ‌దీస్తున్న భువ‌నేశ్వ‌ర్‌ను తిరిగి టీమిండియాలోకి తీసుకోవాల‌ని ప‌లువురు సూచిస్తున్నారు. 

వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2027లో అత‌డిని ఆడించాల‌న్న డిమాండ్లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. కాగా భువనేశ్వర్‌ చివరగా 2022 నవంబర్‌లో టీమ్‌ ఇండియా తరఫున బరిలోకి దిగాడు. ఆ త‌ర్వాత పేల‌వ ఫామ్, యువ బౌల‌ర్లు రాక‌తో భువీ జాతీయ జ‌ట్టులో చోటు కోల్పోయాడు. కానీ భార‌త జ‌ట్టుకు దూర‌మైన‌ప్ప‌టికి భువీ.. ఐపీఎల్‌తో పాటు  యూపీ టీ20, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ వంటి టోర్నీల్లో ఆడుతూ వ‌స్తున్నాడు.

ఈ యూపీ వెట‌ర‌న్ పేస‌ర్‌ ప్ర‌స్తుతం ఫుల్ ఫిట్‌గా క‌న్పిస్తున్నాడు. అయితే భువీ మాత్రం టీమిండియా క‌మ్‌బ్యాక్ గురుంచి ఆలోచించ‌డం లేద‌ని తాజాగా స్ప‌ష్టం చేశాడు. చాలా ఏళ్ల క్రితమే లాంగ్ టెర్మ్ గోల్స్‌ను నిర్దేశించుకోవడం మానేశాను అత‌డు తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత షమీ విషయంలో ఎలాగైతే చర్చ జరిగిందో, ఇప్పుడు భ‌వీ విష‌యంలోనూ  అదే పునరావృతమవుతోంది.
చదవండి: వైభవ్‌ కాదు.. ముందు అతడిని టీమిండియాకు ఎంపిక చేయండి'
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement