కీరన్ పొలార్డ్ (PC: BCCI/IPL)
ఐపీఎల్-2026 ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన తర్వాతి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చెలరేగింది. పంజాబ్ కింగ్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ముంబై ఈ సీజన్‌లో తమ నాలుగో గెలుపు నమోదు చేయడంతో పాటు.. పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసింది.
అయితే, గెలుపు జోష్‌లో ఉన్న ముంబైకి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్‌కు ఐపీఎల్ పాలక మండలి జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత వేయడంతో పాటు.. అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జత చేసింది.
కారణం ఇదే
ముంబై ఇన్నింగ్స్ సందర్భంగా పందొమ్మిదో ఓవర్లో పొలార్డ్ ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగడమే ఇందుకు కారణమని ఐపీఎల్ పాలక మండలి తమ ప్రకటనలో పేర్కొంది. ఫోర్త్ అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించిన కారణంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3 నిబంధనను పోలార్డ్ ఉల్లంఘించాడని.. అంపైర్‌ను అసభ్య పదజాలంతో దూషించాడని పేర్కొంది. పొలార్డ్ తన తప్పిదాన్ని అంగీకరించినట్లు మ్యాచ్ రిఫరీ పంకజ్ ధర్మానీ ధ్రువీకరించినట్లు తెలిపింది.
ముంబైని గెలిపించిన తిలక్ వర్మ
మ్యాచ్ విషయానికొస్తే.. ధర్మశాల వేదికగా టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 200 పరుగులు స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్లలో రియాన్ రికెల్టన్ (23 బంతుల్లో 48) వేగంగా ఆడగా.. రోహిత్ శర్మ (26 బంతుల్లో 25) నిరాశపరిచాడు.
వన్‌డౌన్ బ్యాటర్ నమన్ ధిర్ (9) ఇలా వచ్చి అలా వెళ్లగా.. తిలక్ వర్మ ధనాధన్ దంచికొట్టాడు. 33 బంతుల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా విల్ జాక్స్ (10 బంతుల్లో 25 నాటౌట్) రాణించగా.. ముంబై 19.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
A Tilak of victory for MI 💙
A stunning hit to cap off a truly stunning innings, and the #PunjabKings lose for the fifth time in a row! 😲 #TATAIPL | #PBKSvMI #TilakVarma #SherfaneRutherford #ShardulThakur pic.twitter.com/IPA7IpPqOG— Star Sports (@StarSportsIndia) May 14, 2026


