ఇంగ్లండ్ ​‍క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఒకేసారి ముగ్గురికి | England Squad For New Zealand Test Announced- 3 New Names Including Gay | Sakshi
Sakshi News home page

ENG vs NZ: ఇంగ్లండ్ ​‍క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఒకేసారి ముగ్గురికి

May 13 2026 5:11 PM | Updated on May 13 2026 6:03 PM

England Squad For New Zealand Test Announced- 3 New Names Including Gay

ఇంగ్లండ్ పురుషల క్రికెట్ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో జూన్ 4 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభమయ్యే మొదటి టెస్టు కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది.

ఈ జట్టులో ముగ్గురు కొత్త ఆటగాళ్లకు చోటు దక్కింది. బ్యాటర్ ఎమిలియో గే, ఫాస్ట్ బౌలర్ సోనీ బేకర్, వికెట్ కీపర్ బ్యాటర్ జేమ్స్ రూ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. అయితే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న వైస్‌ కెప్టెన్‌ ఓలీ పోప్‌, ఓపెనర్ జాక్ క్రాలీలపై సెలక్టర్లు వేటు వేశారు.

ఇక గాయం కారణంగా దాదాపు మూడు నెలలగా పోటీ క్రికెట్‌కు దూరమైన కెప్టెన్ బెన్ స్టోక్స్ జాతీయ జట్టులోకి తిరిగొచ్చాడు. ఫిబ్రవరిలో దుర్హం అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి బలంగా తగలడంతో స్టోక్స్ దవడ ఎముక విరిగిన సంగతి తెలిసిందే. స్టోక్సీ ఇటీవలే  కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో దుర్హం తరపున బరిలోకి దిగి తన సత్తాచాటాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో స్టోక్స్‌ డిప్యూటీగా స్టార్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ వ్యహరించే అవకాశముంది.

న్యూజిలాండ్‌తో మొదటి టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు:
బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, సోనీ బేకర్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, మాథ్యూ ఫిషర్, ఎమిలియో గే, జేమ్స్ రూ, ఓలీ రాబిన్సన్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్.

షెడ్యూల్:
మొదటి టెస్టు: జూన్ 4 – 8 (లార్డ్స్)  

రెండవ టెస్టు: జూన్ 17 – 21 (ది ఓవల్)  

మూడవ టెస్టు: జూన్ 25 – 29 (ట్రెంట్ బ్రిడ్జ్)
చదవండి: కమిన్స్‌పై చర్యలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement