మహమ్మద్ సిరాజ్ 'డబుల్‌ సెంచరీ' | Mohammed Siraj completes 200 wickets in T20 cricket | Sakshi
Sakshi News home page

IPL 2026: మహమ్మద్ సిరాజ్ 'డబుల్‌ సెంచరీ'

May 16 2026 9:31 PM | Updated on May 16 2026 9:35 PM

Mohammed Siraj completes 200 wickets in T20 cricket

టీమిండియా పేస‌ర్, గుజ‌రాత్ టైటాన్స్ స్టార్ బౌల‌ర్ మహమ్మద్ సిరాజ్ త‌న టీ20 కెరీర్‌లో అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. టీ20ల్లో 200 వికెట్ల‌ను సిరాజ్ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌-2026లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో అజింక్య ర‌హానే అవుట్ చేయ‌డం ద్వారా సిరాజ్‌ ఈ ఫీట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

ఈ ఘ‌న‌త సాధించిన 21 భార‌త బౌల‌ర్‌గా సిరాజ్ రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 174 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ మియా.. 8.00కు పైగా ఏకాన‌మితో రెండు వందల వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇందులో 6 ఫోర్ వికెట్ హాల్స్ ఉన్నాయి. అదేవిధంగా సిరాజ్ తన ఐపీఎల్ కెరీర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 

2024, 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కూడా సిరాజ్ మియా సభ్యునిగా ఉన్నాడు. సిరాజ్‌టెస్టు క్రికెట్‌లోనే కాకుండా వైట్‌బాల్‌తో కూడా తన మార్క్‌ను చూపిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే... తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.

ఓపెనర్ ఫిన్ అలెన్ విధ్వంసం సృష్టించాడు. అలెన్‌ కేవలం 35 బంతుల్లోనే  4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు అంగ్క్రిష్ రఘువంశీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82), కామెరూన్‌ గ్రీన్‌(52) హాఫ్‌ సెంచరీలతో సత్తచాటారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్‌,సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement