ఆర్సీబీతో మ్యాచ్‌.. కేకేఆర్‌కు భారీ షాక్‌ | KKR spinner doubtful for must-win IPL 2026 clash against RCB | Sakshi
Sakshi News home page

IPL 2026: ఆర్సీబీతో మ్యాచ్‌.. కేకేఆర్‌కు భారీ షాక్‌

May 12 2026 10:17 PM | Updated on May 12 2026 10:17 PM

 KKR spinner doubtful for must-win IPL 2026 clash against RCB

ఐపీఎల్‌-2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా కేకేఆర్ బుధవారం రాయ్‌పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కేకేఆర్ ఈ మ్యాచ్‌లో కూడా కచ్చితంగా గెలవాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌కు నైట్‌రైడర్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్‌లో ఆడేది అనుమానమే. 

చక్రవర్తి  ప్రస్తుతం ఎడమ చేతి వేలి గాయంతో బాధపడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అతడు గాయంతోనే బరిలోకి దిగాడు. అయితే ఢిల్లీ-ఆర్సీబీ మ్యాచ్‌కు మధ్యలో 6 రోజుల గ్యాప్ రావడంతో అతడు కోలుకుంటాని కేకేఆర్ మేనెజ్‌మెంట్ భావించింది. కానీ అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఆర్సీబీతో మ్యాచ్‌కు చక్రవర్తి దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. తాజాగా అత‌డి గాయంపై కేకేఆర్ సహాయ కోచ్ షేన్ వాట్సన్ అప్‌డేట్ ఇచ్చాడు.

"వైభ‌వ్ గ‌త రెండు మ్యాచ్‌ల‌లోనూ చాలా నొప్పితో బాధ‌ప‌డ్డాడు. అయిన‌ప్పటికి అత‌డు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే ఆర్సీబీతో మ్యాచ్‌కు అత‌డు అందుబాటులో ఉంటాడా? లేదా అన్న‌ది క‌చ్చితంగా తెలియ‌దు. కానీ అత‌డు టీమ్ సెల‌క్ష‌న్ అందుబాటులో ఉండాల‌ని మేము ఆశిస్తున్నాం" అని వాట్సన్ ప్రీ మ్యాచ్ కాన్ఫ‌రెన్స్‌లో పేర్కొన్నాడు.

కాగా క్రిక్‌బ‌జ్ నివేదిక ప్ర‌కారం.. వ‌రుణ్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నప్పటికీ, పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయలేదు. అతను కొన్ని స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తూ క‌న్పించాడు. ఇక ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 10 మ్యాచ్‌లు ఆడిన చ‌క్ర‌వ‌ర్తి.. 8 వికెట్లు ప‌డ‌గొట్టాడు.
చదవండి: క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 50 ఓవర్లలో 822 పరుగులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement