ఐపీఎల్-2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. 248 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ క్రీజులో ఉన్నంతసేపు గుజరాత్ లక్ష్యాన్ని అందుకుంటుందని అంతా భావించారు. కానీ సునీల్ నరైన్ బౌలింగ్‌లో గిల్ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ కావడంతో మ్యాచ్ చేజారిపోయింది. చివరిలో సాయిసుదర్శన్, జోస్ బట్లర్ కాస్త దూకుడుగా ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయారు. గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బట్లర్(57), సాయిసుదర్శన్(53 నాటౌట్) రాణించారు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ ఫిన్ అలెన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 35 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్లుతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు అంగ్క్రిష్ రఘువంశీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82), కామెరూన్ గ్రీన్(52) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్,సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు.


