పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 100 వికెట్లు తీసిన తొలి పాకిస్తాన్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో షాహీన్ ఇప్పటికే 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ ఇంకా జరుగుతుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో షాహీన్ వికెట్ల సంఖ్య 103కు చేరింది.
పాకిస్తాన్ తరఫున WTCలో అత్యధిక వికెట్లు:
* షాహీన్ అఫ్రిది – 103
* నౌమన్ అలీ – 89
* సాజిద్ ఖాన్ – 63
* నసీం షా – 60
ఇదే మ్యాచ్‌లో షాహీన్ మరో ఘనత కూడా సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్ల చారిత్రక మైలురాయిని తాకాడు. మొమినుల్ హక్ వికెట్ షాహీన్‌కు 400వ వికెట్. కేవలం 26 ఏళ్ల వయసులోనే 211 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో షాహీన్ ఈ ఘనత సాధించడం విశేషం. ప్రస్తుతం షాహీన్ ఖాతాలో వన్డేల్లో 139, టీ20ల్లో 136, టెస్ట్‌ల్లో 125 వికెట్లు ఉన్నాయి.
తొమ్మిదో బౌలర్
షాహీన్ 400 వికెట్ల క్లబ్లో చేరిన తొమ్మిదో పాకిస్తాన్ బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో వసీం అక్రమ్ 916 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, వకార్ యూనిస్ 789 వికెట్లు, ఇమ్రాన్ ఖాన్ 544 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
పాకిస్తాన్ తరఫున అత్యధిక అంతర్జాతీయ వికెట్లు:
* వసీం అక్రమ్ – 916
* వకార్ యూనిస్ – 789
* ఇమ్రాన్ ఖాన్ – 544
* షాహిద్ అఫ్రిది – 538
* సక్లెయిన్ ముస్తాక్ – 496
* సయీద్ అజ్మల్ – 447
* షోయబ్ అక్తర్ – 438
* ఉమర్ గుల్ – 427
* షాహీన్ అఫ్రిది – 400*
కాగా, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో పాక్ వెనుకపడింది. తొలి ఇన్నింగ్స్‌లో మెహిది హసన్ మిరాజ్ ఐదు వికెట్లు తీసి పాక్‌ను కట్టడి చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 152/3 స్కోరుతో 179 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన బంగ్లా కెప్టెన్ షాంటో, రెండో ఇన్నింగ్స్‌లో 58 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం చివరి రోజు ఆట కొనసాగుతుంది.


