గిల్‌ మెరుపులు వృథా.. గుజరాత్‌పై కేకేఆర్‌ విజయం | Gujarat titans vs Kolkata knight riders Live updates | Sakshi
Sakshi News home page

IPL 2026: గిల్‌ మెరుపులు వృథా.. గుజరాత్‌పై కేకేఆర్‌ విజయం

May 16 2026 7:09 PM | Updated on May 16 2026 11:32 PM

Gujarat titans vs Kolkata knight riders Live updates

Gujarat titans vs Kolkata knight riders Live updates: ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో కేకేఆర్‌ విజయం సాధించింది. 249 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగల్గింది.

గుజరాత్‌ బ్యాటర్లలో శుభ్‌మన్‌ గిల్‌ (49 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. బట్లర్‌(57), సాయిసుదర్శన్‌(53 నాటౌట్‌) రాణించారు. కేకేఆర్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌ రెండు, దూబే, గ్రీన్‌ తలా వికెట్‌ సాధించారు.

కేకేఆర్‌ రెండో వికెట్‌ డౌన్‌
177 పరుగుల వద్ద కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 85 పరుగులు చేసిన గిల్‌.. సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

రసవత్తరంగా జీటీ-కేకేఆర్‌ మ్యాచ్‌
16 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ వికెట్ నష్టానికి 177పరుగులు చేసింది. క్రీజులో గిల్‌(85), జోస్‌ బట్లర్‌(50) ఉన్నారు.

గిల్‌ హాఫ్‌ సెంచరీ
12 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ వికెట్‌ నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో గిల్‌(52), జోస్‌ బట్లర్‌(29) ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న గిల్‌
9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ వికెట్‌ నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్‌ గిల్‌(46), జోస్‌ బట్లర్‌(6) ఉన్నారు.

కేకేఆర్‌ తొలి వికెట్‌ డౌన్‌
49 పరుగుల వద్ద కేకేఆర్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు చేసిన సింధు.. నరైన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

గుజ‌రాత్ టైటాన్స్‌కు భారీ షాక్‌
గుజ‌రాత్ టైటాన్స్‌కు భారీ షాక్ త‌గిలింది. ఇన్ ఫామ్ బ్యాట‌ర్ సాయిసుద‌ర్శ‌న్(23) గాయం కార‌ణంగా రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. 4 ఓవ‌ర్లు ముగిసే సరికి గుజ‌రాత్ 49 ప‌రుగులు చేసింది.

గుజరాత్‌ ముందు భారీ టార్గెట్‌
ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్ 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అలెన్‌ కేవలం 35 బంతుల్లోనే  4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. 

అతడితో పాటు అంగ్క్రిష్ రఘువంశీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82), కామెరూన్‌ గ్రీన్‌(52) హాఫ్‌ సెంచరీలతో సత్తచాటారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్‌,సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు.

భారీ స్కోర్‌ దిశగా కేకేఆర్‌
అలెన్‌ ఔటైనప్పటికి గ్రీన్‌(35), రఘువంశీ(45) దూకుడుగా ఆడుతున్నారు.16 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 192/2

ఫిన్‌ అలెన్‌
ఫిన్‌ అలెన్‌ రూపంలో కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. కేవలం 35 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93 పరుగులు చేసిన అలెన్‌.. సాయికిషోర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఫిన్‌ అలెన్‌ హాఫ్‌ సెంచరీ
ఫిన్‌ అలెన్‌ 21 బంతుల్లో తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 8 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 85/1

తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్ 
ర‌హానే రూపంలో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 14 ప‌రుగులు చేసిన ర‌హానే.. సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 5 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 47/1

ఆచితూచి ఆడుతున్న ఓపెనర్లు
2 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్‌ వికెట్‌ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. క్రీజులో అజింక్య రహానే(9), ఫిన్‌ అలెన్‌(4) ఉన్నారు.

ఐపీఎల్‌-2026లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. కేకేఆర్‌ జట్టులోకి వరుణ్‌ చక్రవర్తి తిరిగి రాగా.. గుజరాత్‌ టీమ్‌లోకి సాయి కిషోర్ వచ్చాడు. 

తుది జట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ : అజింక్యా రహానే(కెప్టెన్‌), ఫిన్ అలెన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్‌ కీపర్‌), కామెరాన్ గ్రీన్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, సౌరభ్ దూబే, కార్తీక్ త్యాగి

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్(కెప్టెన్‌), జోస్ బట్లర్(వికెట్‌ కీపర్‌), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement