సన్‌రైజర్స్‌ అభిమానులకు భారీ షాక్‌ | Virat Kohli effect? Ticket prices surge 110 Percent for SRH vs RCB match in Hyderabad | Sakshi
Sakshi News home page

IPL 2026: సన్‌రైజర్స్‌ అభిమానులకు భారీ షాక్‌

May 16 2026 6:00 PM | Updated on May 16 2026 6:36 PM

Virat Kohli effect? Ticket prices surge 110 Percent for SRH vs RCB match in Hyderabad

ఐపీఎల్‌-2026లో మే 22న ఉప్పల్ మైదానం వేదికగా జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌లో ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడం, దానికి తోడు కింగ్ విరాట్ కోహ్లి బరిలోకి దిగనుండడంతో ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. 

దీనిని క్యాష్ చేసుకునేందుకు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం టికెట్ ధరలను ఏకంగా 50% నుండి 110% వరకు పెంచేసింది. ధరలు భారీగా పెరిగినప్పటికీ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. సన్‌రైజర్స్‌ యాజమాన్యం ఈ మ్యాచ్‌కు కనిష్ట టికెట్‌ ధరను రూ.1,950గా.. గరిష్ట ధరను ఏకంగా రూ.45,000గా నిర్ణయించింది. 

సౌత్‌ రెండో అంతస్తులోని కార్పొరేట్‌ బాక్సు టికెట్‌ ధర రూ.45,000 పలకడం విశేషం. గతంలో ఈ టికెట్ ధర రూ. 30,000గా ఉండేది. అలాగే వెస్ట్‌ రెండో అంతస్తు కార్పొరేట్‌ బాక్సు ధర రూ.30,000గా, ఆరెంజ్‌ ఆర్మీ ఈస్ట్, వెస్ట్‌ లాంజ్‌ల ధరను రూ.20,000గా నిర్ణయించారు. 

ఇక టికెట్లు దొరకని అభిమానుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని సోషల్ మీడియా వేల రూపాయలకు టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్నారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. బ్లాక్ టికెట్ దందా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

కాగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉన్న ఆర్సీబీ మరో విజయం సాధిస్తే అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తోంది. మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్‌ గత మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడిపోయి గట్టి షాక్ తింది.ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ వాళ్లకు చావో రేవో లాంటిది.
చదవండి: గిల్‌, పృథ్వీ షాతో కలిసి ఆడాడు.. కట్‌ చేస్తే! ఇప్పుడు ఓ జట్టునే కొనేశాడు

Advertisement
 
Advertisement
Advertisement