అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు 19న భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: ఐపీఎల్ సందడి ముగిసిన తర్వాత వారం రోజుల్లోపే భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేల్లో టీమిండియా తలపడుతుంది. జూన్ 6 నుంచి న్యూ చండీగఢ్‌లో ఏకైక టెస్టు జరగనుండగా... జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నైలలో వన్డేలు ఉంటాయి.
ఈ మ్యాచ్‌ల కోసం వేర్వేరు జట్లను ఎంపిక చేసేందుకు అజిత్ అగార్కర్ నాయకత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం సమావేశం కానుంది. టెస్టు జట్టు విషయంలో ఎలాంటి ప్రయోగాలు చేయరాదని సెలక్టర్లు భావిస్తుండగా... వన్డేల విషయంలో మాత్రం కొందరు కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. టీమ్ టాప్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు మాత్రం ఈ సిరీస్‌ల నుంచి విశ్రాంతినిచ్చే అవకాశం కనిపిస్తోంది.
అఫ్గానిస్తాన్ బలహీన టెస్టు టీమ్ కావడంతో పాటు స్వదేశంలో జరిగే టెస్టులో సహజంగానే స్పిన్నర్ల ఆధిపత్యం సాగుతుంది. కాబట్టి బుమ్రా అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. వన్డేల్లో కూడా యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు ఇది తగిన అవకాశం. కాబట్టి మూడు ఫార్మాట్‌లలో కీలక బౌలరైన బుమ్రాకు విశ్రాంతినివ్వడానికి సరైన సమయంగా సెలక్షన్ కమిటీ భావిస్తోంది.
ఒకవేళ టెస్టు ఆడాలనుకుంటే వన్డే సిరీస్ నుంచి, వన్డేలు ఆడాలనుకుంటే టెస్టు నుంచి బుమ్రాను పక్కన పెట్టవచ్చు. టెస్టులో హైదరాబాదీ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ప్రధాన పేసర్లు కాగా మూడో పేసర్ ఎంపికకు చాన్స్ తక్కువ. గత ఏడాది రంజీల్లో అత్యధిక వికెట్లతో సత్తా చాటిన ఆకిబ్ నబీ ఎంపికపై చర్చ జరుగుతున్నా... పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్, ఆంధ్ర ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి నుంచి అతను పోటీని ఎదుర్కొంటున్నాడు.
స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఖాయం కాబట్టి అక్షర్ పటేల్‌కు కూడా చోటు దక్కడం అనుమానమే. టెస్టు జట్టులో మూడో స్థానానికి సాయి సుదర్శన్ స్థానంలో దేవదత్ పడిక్కల్ పేరు పరిశీలనలో ఉంది. టెస్టు వికెట్ కీపర్ల విషయంలో ఎలాంటి ప్రత్యామ్నాయ ఆలోచన లేకుండా రిషభ్ పంత్, ధ్రువ్ జురేల్ తమ స్థానాలు నిలబెట్టకోవడం స్పష్టం.
ప్రిన్స్‌కు అవకాశం!
భారత వన్డే జట్టులో మాత్రం పలు మార్పులకు ఆస్కారం కనిపిస్తోంది. విజయ్ హజారే టోరీ్నలో 17 వికెట్లు పడగొట్టడంతో పాటు ప్రస్తుత ఐపీఎల్‌లో కూడా చెలరేగుతున్న ప్రిన్స్ యాదవ్ పేరుపై చర్చ సాగుతోంది. హర్షిత్ రాణా ఇంకా ఫిట్‌గా లేకపోవడంతో ప్రిన్స్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. నిజానికి ప్రస్తుత స్థితిలో భారత్–అఫ్గానిస్తాన్ మధ్య వన్డే సిరీస్‌కు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా... విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఆడుతుండటంతో సహజంగానే దీనిపై ఆసక్తి పెరిగింది.